- Advertisement -
జగిత్యాల: ఎమ్మార్పీఎస్ ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జ్ గా చిర్ర లక్ష్మణ్ మాధిగను నియమిస్తూ ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ సురుగు శ్రీనివాస్ మాదిగ ఉత్తర్వులు జారీచేశారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో యశ్వంత్ రావు పేటకు చెందిన లక్ష్మణ్ ఎమ్మార్పీఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడని గుర్తించి ఈ నియామకాన్ని చేపట్టినట్లు సురుగు శ్రీనివాస్ పేర్కొన్నారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జ్ గా నియామకానికి కృషిచేసిన మందకృష్ణ మాదిగ, ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ దూమాల గంగారాం, జిల్లా కో కన్వీనర్ బెజ్జంకి, ఎంఎస్పీ ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జ్ అరికిళ్ల సతీష్ లకు ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



