జోరుగా పోచారం లో ఇంటింటికి బిఆర్ఎస్ ప్రచారం
ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు
– మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి
పోచారం, నవంబర్ 09 (వాయిస్ టుడే) : పోచారం మున్సిపాలిటీలో చైర్మన్ కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి కి మద్దతుగా కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ లో జరిగిన అభివృద్ధిని ఇంటింటికి ప్రచారం చేస్తూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని, కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని,ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని దృఢంగా కోరుకుంటున్నారని, భారీ మెజార్టీతో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం వ్యక్తం చేశారు.అదేవిధంగా చామకూర మల్లారెడ్డిని మేడ్చల్ నుండి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి కెసిఆర్ కు బహుమతిగా అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



