ఖమ్మం: పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సీపీఐ పార్టీ ల పోత్తులో ఎన్నికలకు పోతున్నాం. కొత్తగూడెం నుండి కూనంనేని సాంబశివరావు పోటీలో ఉన్నారు. కూనంనేని గెలుపుకు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు కృషి చేయాలి. నిన్న జరిగిన ఐటి దాడులు 30 ప్రాంతాలలో 400 మంది రైడ్ జరిపారు. నేను భయపేడే వాన్నే అయితే అధికార పార్టీ నుండి బయటకు వచ్చే వాన్ని కాదు. భయపడే వాన్ని అయితే బిజెపి లోనే జాయిన్ అయ్యి వాన్ని. ఇంకా ఇవ్వాళ కూడా కొన్ని ప్రాంతాలలో రైడ్ జరుగుతుందని అన్నారు.
సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ , స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారం లో ఉన్న వాళ్లను ప్రొటెక్ట్ చేస్తున్నారా అనే సందేహం కలుగుతుంది. అధికార పార్టీ వత్తిల్లకు లోను అయ్యి నోరు విప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ వాళ్ళను ఇబ్బందులు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో స్ట్రాంగ్ గా ఉన్నదని తెలంగాణ లో కాంగ్రెస్ ను అధికారంలో కి రానివ్వద్దని దాడులు చేస్తున్నారని అన్నారు.
ఆ రెండు ఫెఫికాల్ పార్టీలు కలిసి చేస్తున్నాయి. మా ఇంట్లో నిన్న రైడ్ చేస్తే వారికి దొరికింది ఏమి లేదు. నా అల్లుడి ని ఇబ్బంది పెట్టి భయబ్రాంతులకు గురి చేసి అరెస్టు చేస్తామని బెదిరించారు. రాఘవ కన్స్ట్రక్షన్ మేనేజర్ జయ ప్రకాష్ పై థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. ఒంటి కాలు మీద కుర్చీలో అర్థ గంట నిలబెట్టారు. వాళ్ళ పరిధిని దాటి ప్రవర్తిచడానికి కారణం ఏమిటి..? మ్యాన్ హ్యాండిల్ చేసే రైడ్ మీకు ఎవరు ఇచ్చారని అడిగారు. మేము చెప్పినట్టు వినక పోతే జీవితాంతం జైలు లో పెడతాము అని బెదిరిస్తున్నారు మా వాళ్ళను. ఇవ్వాళ అధికారం లో ఉన్న పార్టీకి వత్తాసు పలికితే రేపు దోషులు గా మీరు కూడా నిలబడాల్సి వస్తుంది. బి.ఆర్.ఏస్ పార్టీ నుండి నేను బయటకు వచ్చాక నాతో పాటు నా వెంట బయటకు వచ్చిన నా వాళ్ళ పై అనేక అక్రమ కేసులు పెట్టారు. ఐరేజ్ కంపెనీ మీద ఒక బినామీ పిటిషన్ పై వేసి మమ్ములను పనులు చేయవద్దని ఇబ్బంది పెట్టారు. హై కోర్టు నుండి అనుమతులు తీసుకొని మేము పనులు చేస్తున్నాము. గన్ మెన్ లను తగ్గించారు అయినా ఓర్చుకున్నాను. రిటర్న్ గిఫ్ట్ గా తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఇస్తారు. మెయిన్ గిఫ్ట్ గా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఇస్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు కష్టపడి పని చేయాలని అన్నారు.
ఐటీ దాడులకు భయపడేది లేదు: పొంగులేటి
- Advertisement -
- Advertisement -