- Advertisement -
హైదరాబాద్: మైనార్టీల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి. చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈద్గాలలో ముస్లిమ్ మైనార్టీలను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని లక్ష్మారెడ్డి కోరారు. మైనార్టీల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన పధకాలను వివరించారు. అందరూ మరొకసారి అభివృద్ధికి పట్టం కడుతూ బి.ఆర్.ఎస్. కి ఓటు వేసి ఉప్పల్ లో మరొకసారి గులాబీ జెండా ఎగురవేయాలని, కేసీఆర్ ను మూడవసారి ముఖ్యమంత్రిని చేయాలని బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు.

- Advertisement -



