సుధీర్ రెడ్డి గెలుపు ఖాయం: వెన్నపొల్ల పార్వతిగౌడ్
అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని లింగోజిగూడ డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు వెన్నపొల్ల పార్వతిగౌడ్ అన్నారు. లింగోజిగూడ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం అనంతరం పార్వతిగౌడ్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కెసిఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకే ఎల్బీనగర్ లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఏ ఇంటికి వెళ్లినా సుధీర్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని ఆమె వివరించారు. సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందితే ఎల్బీనగర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు. కారు గుర్తుపై ఓటు వేసి దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు.



