Wednesday, March 11, 2026

దొరలపాలని అంతం చేయడం కోసం నియంత పాలన

- Advertisement -

Dictator’s rule to end tyrann

నిలువున పాతర వేయడం కోసం

ప్రజాస్వామ్య పాలన కోసం వేచి చూద్దాం-బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి భోగ శ్రావణి

బి ఆర్ యస్ నుంచి బిజెపిలోకి తరలివస్తున్నా మహిళలు,యువకులు

జగిత్యాల జిల్లా బ్యూరో (నవంబర్ 13,23)వాయిస్ టుడే :జగిత్యాల పట్టణంలోని 10వ వార్డ్ లింగంపేట్ కి చెందిన 55 మంది మహిళలు యువకులు భారత ప్రధాని నరేంద్రమోడి అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జగిత్యాల పట్టణ అధ్యక్షులు వీరభత్తిని అనిల్ కుమార్, సిరికొండ రాజన్న, దువ్వాక కళ్యాణ్, జుంబర్తి నారాయణ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ లో చేరగా వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి భోగ శ్రావణి మాట్లాడుతూ
కమల కుటుంబంలోకి ధర్మం కోసం, న్యాయం కోసం బిజెపితో చేయి చేయి కలిపి పోరాటం కోసం విచ్చేసిన యువతకి జోహార్లు అని కొనియాడారు.దొరలపాలని అంతం చేయడం కోసం నియంత పాలన నిలువున పాతర వేయడం కోసం ప్రజాస్వామ్యపాలన కోసం వేచి చూద్దాం అని హితవు పలికారు.బెదిరించే రాక్షస పాలన మనకు వద్దు అన్నారు. గడిచిన శతాబ్దంలో ఒక్కరి కుటుంబ పాలనలో ఈ రాష్ట్రం కొనసాగుతుంది.బెదిరింపులు అక్రమ కేసులు పెట్టి యువకుల జీవితాలను ఆగం చేస్తున్న ప్రభుత్వ పాలనకీ చరమ గీతం పాడు దాం అని అన్నారు.ప్రజా పాలన రావాలి ప్రజాస్వామ్యం వెళ్లి విరియాలి.అని అన్నారు.దొరల పాలన అంతం కావాలి సానుకూల ప్రజా పక్షపాతి ప్రభుత్వం రావాలి అని హితవు పలికారు.జగిత్యాల నియోజకవర్గం లో ప్రతి ఒక్కరి కోసం అహర్నిశలు శ్రమిస్తాను అనుక్షణం మీకు అందరికీ అందుబాటులో ఉండి పాలన కొనసాగిస్తాను అన్నారు.మన కోసం, మన హక్కుల కోసం మన సుపరిపాలన కు పాటు పడదాం, రామరాజ్యం స్థాపిద్దాం నరేంద్ర మోడీ పాలనను మన రాష్ట్రానికి తీసుకొద్దాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు వీరభత్తిని అనిల్,పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దురిశెట్టి మమత, ఎక్కలదేవి మల్లేశం, శక్తి కేంద్రం ఇంచార్జ్ చిట్యాల రమేష్,లింగారెడ్డి, శేఖర్, జుంబర్తి నారాయణ, కండ్ల పెళ్లి రాకేష్,సిరికొండ మొండయ్య మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్