వరంగల్, నవంబర్ 14, (వాయిస్ టుడే ): స్టేషన్ ఘన్‌పూర్‌లో ఇందిరను గెలిపించాల్సిన బాధ్యత తన భుజాల పై ఉందన్నారు టీపీసీసీ రేవంత్ రెడ్డి. ఇవాళ కాంగ్రెస్ విజయభేరీ సభ స్టేషన్ ఘన్‌పూర్‌లో జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఐనా తర్వాత.. రాజయ్య లాంటి వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆడపడుచులకు కాలు బయటపెట్టాలంటే భయపడుతున్నారన్నారు రేవంత్ రెడ్డి. ఆడబిడ్డ విషయంలో కడియం శ్రీహరి, రాజయ్య లు మాట్లాడే పద్ధతిలో మాట్లాడాలన్నారు. శ్రీహరి సంగతి రాజయ్య చెప్పిండు, రాజయ్య సంగతి శ్రీహరి చెప్పిండన్నారు రేవంత్ రెడ్డి. వారిద్దరి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదని, రాజయ్య గురించి… ఆయన రాజయ్యనా కృష్ణయ్యానా మనం చెప్పాల్సిన పనిలేదన్నారు. సొంత పార్టీ నాయకులకే వారిపై నమ్మకం లేదు అన్నారు రేవంత్ రెడ్డి. డిగ్రీ కాలేజీ లేదు, 100 పడకల ఆస్పత్రి లేదని, ఇందిరమ్మ ను గెలిపించండి, డిగ్రీ కాలేజ్ తో పాటు 100 పడకల ఆస్పత్రికి నాది గ్యారంటీ అని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే నిర్మించే బాధ్యత నాది అని ఆయన అన్నారు. రెండు సంవత్సరాలలో కేసీఆర్ హరీష్ రావు, కవితమ్మ, రాజయ్య కడియం శ్రీహరి లు పిచ్చి కుక్కల లెక్క తిరుగుతున్నారని, మొదటిసారి మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేదన్నారు.
రెండవసారి మంత్రివర్గంలో మాదిగలకు స్థానం లేదని, బీఆర్ఎస్ పార్టీ ఆరుగురు మహిళలకు టికెట్ ఇస్తే… కాంగ్రెస్ పార్టీ 12 మంది మహిళలకు టికెట్ ఇచ్చిందన్నారు. తెలంగాణ బడికి పోయే పోరడు… మీరు సీసా పట్టుకుని బజారులో తిరుగుతుండని, వన్స్ లు బార్లు బెల్ట్ షాపులు పెట్టి… పేదోళ్ల బతుకులు కొల్లగొడుతున్నాడు కేసీఆర్ అని ఆయన అన్నారు. దద్దమ్మ దయాకర్ రావు, ఊసారబెళ్ళి దయాకర్ రావు చుట్టపొడని మంత్రి పదవి ఇచ్చిండన్నారు. దద్దమ్మ దయాకర్ రావు, కడియం శ్రీహరిలు సక్కనైన ఇద్దరిదీ ఒకటే ఊరన్నారు. తెలంగాణ ప్రభుత్వం మనం ఎన్నుకున్న ప్రభుత్వం కాదని, మనల్ని దోచుకున్న ప్రభుత్వం…దండుపాళ్యం ప్రభుత్వమన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగుల ను అడవి లో అన్నలు కావడానికి… కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేనన్నారు. పాపం చెల్లింది.. కెసిఆర్ వి 100 తప్పులు పూర్తయ్యాయి.. ఎన్నికల్లో కేసీఆర్ ను బొంద పెట్టాలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలని, స్టేషన్ ఘనపూర్ లో ఇందిరమ్మను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ వస్తే.. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఏది బంధు కాదన్నారు రేవంత్ రెడ్డి.