న్యూయార్క్, నవంబర్ 15, (వాయిస్ టుడే ): కొవిడ్’ పేరు వినిపించకుండా.. గత కొంతకాలంగా ప్రశాంతంగా జీవిస్తున్న ప్రపంచ దేశాలకు షాక్! అమెరికాలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వేరియంట్ హెచ్వీ.1 ఇందుకు కారణం. ఈ కొవిడ్ వేరియంట్ వ్యాప్తి ఆందోళకరంగా ఉందని తెలుస్తోంది.సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. అక్టోబర్ 28 నుంచి ఇప్పటివరకు వెలుగు చూసిన కొవిడ్ కేసుల్లో హెచ్వీ.1 వేరియంట్ వాటా దాదాపు 25.2శాతంగా ఉంది. జులైలో వెలుగులోకి వచ్చిన కేసుల్లో దీని వాటా 0.5శాతంగా ఉండగా, ఇప్పుడు 12.5శాతానికి పెరిగింది. ఫలితంగా.. అమెరికాలో వేగంగా వ్యాపిస్తున్న వేరియంట్గా ఇది నిలిచింది.”కొవిడ్ వైరస్లు మ్యూటేట్ అవుతూ ఉంటాయి. ఈ విషయం మనకి ఇప్పటికే అర్థమైంది. ఈ హెచ్వీ.1.. ఒమిక్రాన్ సబ్వేరియంట్స్ను పోలి ఉంటుంది,” అని వెండర్బిల్ట్ వర్సిటీ మెడికల్ సెంటర్ ప్రొఫెసర్ డా. విలియం స్కాఫ్నర్ తెలిపారు. ఒమిక్రాన్కు మనవడిగా ఈ హెచ్వీ.1ని మనం పరిగణించవచ్చని అన్నారు.జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, దగ్గు, గొంతు నొప్పి, ఖండరాల నొప్పులు వంటివి ఈ హెచ్వీ.1 కొవిడ్ వేరియంట్ లక్షణాలుగా ఉన్నాయి.శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో.. హెచ్వీ.1 వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలు, స్క్రీనింగ్ వంటి చర్యలను అమలు చేస్తున్నారు.హెచ్వీ.1 వేరియంట్ కన్నా ముందు.. అమెరికాలో మరో వేరియంట్ వేగంగా వ్యాపించేది. దాని పేరు ఈజీ.5. ఫిబ్రవరి 17న దీనిని ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా పేర్కొంది డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ). జులైలో వీయూఎం (వేరియంట్ అండర్ మానిటరింగ్)గా మార్చింది.హెచ్వీ.1తో పాటు అమెరికాలో ఈజీ.5, ఫోర్నాక్స్, ఎఫ్ఎల్.1.5.1, ఎక్స్బీబీ.1.16 వంటి కొవిడ్ వేరియంట్లు కూడా యాక్టివ్గా ఉన్నాయి. వీటన్నింటిలోకెల్లా.. ప్రస్తుతం హెచ్వీ.1 కాస్త ఆందోళనకర స్థితిలో ఉంది: ఈజీ.5 కొవిడ్ వేరియంట్పై అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ సూచించింది.