గ్రామ గ్రామాన జననీరాజనం కదం తొక్కుతున్న కాంగ్రెస్ సైన్యం….
నాగర్ కర్నూల్: పెంట్లవెళ్లి మండలం జటప్రోల్ గ్రామంలో పల్లె పల్లెకు జూపల్లి గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు పాల్గొని గ్రామం లోని ప్రతి ఇంటికి తిరుగుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమలు చేసే ఆరు గ్యారెంటీల గురించి ప్రజలు వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలలో జరిగిన అరాచకాలు,అక్రమాలకు పాల్పడిన నాయకులకు ఈ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ది చెప్పాలని కోరారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ హస్తం గుర్తుపై ఓటు వేసి సోనియమ్మ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాజా,మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీమండల గ్రామ అధ్యక్షులు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.