- Advertisement -
జగిత్యాల: సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని, కామారెడ్డి లో రేవంత్ రెడ్డి గెలుపు ఖాయమేనని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కామారెడ్డి లో రేవంత్ రెడ్డి గెలుపు గోడమీద రాత అని, కామారెడ్డి లో రేవంత్ రెడ్డి గెలుపు ఖాయం అయిందని తెలిసి, సీఎం కేసీఆర్ మళ్లీ గజ్వేల్ కు పోతున్నారన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు ఇప్పటికైనా తెలుసుకున్నారని, తెలంగాణ ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారన్నారు.
- Advertisement -