
ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే ఎలిమెంట్స్ తో సినిమా రక్తి కట్టిస్తుందని ఇంతకుముందు కథనాలొచ్చాయి. రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రం మూల కథ ఆఫ్రికా అడవుల్లోని నాగరికత ఆధారంగా కొనసాగుతుందని తెలిపారు. అయితే ఈ కథను ఎలా దక్కించుకున్నారు? అన్నదానికి తాజాగా సమాచారం అందింది. పాపులర్ అంతర్జాతీయ నవల ఆధారంగా ఈ సినిమాని రెండు భాగాలుగా రూపొందించనున్నారని, ఈ సిరీస్ హక్కులను పొందడం విజయవంతంగా పూర్తి చేసారని సమాచారం. ప్రముఖ రచయిత విల్బర్ స్మిత్ నవలల ఆధారంగా స్క్రిప్టును మలిచారని కూడా తెలిసింది.
విల్బర్ స్మిత్ పాపులర్ నవలలు `ది బాలంటైన్` టైటిల్ తో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయి. నవలల హక్కులను రాజమౌళి- కె.ఎల్ నారాయణ బృందం ఛేజిక్కించుకున్నారని తెలిసింది. బాలంటైన్ కుటుంబ జీవితాలను ఈ నవలల్లో స్పర్శించారు. మూడు దశాబ్దాల కాలంలో ప్రచురించిన కథలు ఇవి. సిరీస్లో మొత్తం ఏడు నవలలు ఉన్నాయి. వాటి పేర్లు – ది ఫాల్కన్ ఫైల్స్, ది మెన్ అఫ్ మెన్, ది ఏంజెల్స్ వీప్, ది లేపర్డ్ హంట్స్ ఇన్ డారక్నెస్, ది ట్రింఫ్ అఫ్ సన్, కింగ్ అఫ్ కింగ్స్, కాల్ అఫ్ ది రోవెన్ – ఇలాగ వేరు, వేరు, పేర్లతో ఈ నవల్స్ చాలా అడవెంచరస్ మూడ్ లో సాగుతాయి. ప్రపంచం లో అత్యధికం గా అమ్ముడు పోయిన బుక్స్ జాబితా లో ఈ సిరీస్ ఉన్నాయి.
ఇవ్వన్నీ చూస్తుంటే, ఎప్పటిలాగే, రాజమౌళి, తన కధ ల మీద, స్క్రిప్ట్ మీద ఎంత శ్రద్ధ, డెడికేషన్ చూపిస్తారో, మనం వేరే చెప్పక్కర్లేదు. ఈ వివరాలు అన్నీ ఇంకా కన్ఫర్మెడ్ గా తెలియాలంటే కొంత కాలం ఎదురు చూడాలి. ఏదయినా ఒకటి మాత్రం నిజం – రాజమౌళి – మహేష్ కాంబినేషన్ లో రెండు భాగాలుగా వస్తున్న సినిమా, ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి, తెలుగు సినిమా స్థాయి ని మరింత పెంచుతుంది అనడం లో, ఎలాంటి డౌట్ లేదు – సత్య కేశరాజు



