Thursday, March 12, 2026

ఒక్క ఛాన్స్ అంటున్న కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి: హరీష్ రావు

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో మంత్రి హరీశ్ రావు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ఆరు గ్యారంటీ అంటూ తెలంగాణ ప్రజలను మోసం చేయటానికి వస్తున్నారు. కర్ణాటక లో ఇచ్చిన హామీలే అమలు కావడం లేదు. కర్ణాటక లో ఓటేసిన ప్రజలకు పథకాలు అందటం లేదని అన్నారు. కర్ణాటక ప్రజలు ఏది అడిగినా ఖజానా ఖాళీ అయ్యింది అని అక్కడ సీఎం చెప్తున్నారు. అయిదు గ్యారంటీ లని చెప్పిన కాంగ్రెస్ ప్రజలకు రాం రాం చెప్పారు. ఎన్నికలప్పుడు ఓడ మల్లప్ప ,ఎన్నికలు ముగియగానే బోడ మల్లప్ప అన్నట్టుగా ఉన్నది రాహుల్ గాంధి తీరు. కర్ణాటక లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరునెలలు పూర్తవుతుంది.  కర్ణాటక ఎన్నికలపుడు గ్యారంటీల ప్రారంభానికి కాలపరిమితి పెట్టిన రాహుల్ గాంధీ ఇపుడు రకరకాల షరతులను పెడుతూ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నారని అన్నారు.
విద్యార్థుల స్కాలర్ షిప్ లు ఇవ్వటం లేదు. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు. స్కాలర్ షిప్ లు ఇవ్వకుండా కోత పెట్టీ కార్మికుల పిల్లల చదువుకు దూరం చేస్తోంది. తెలంగాణ లో కాంగ్రెస్ రంగు రంగుల ప్రపంచం చూపుతోంది. కర్ణాటక ప్రజా ప్రతినిదుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. అభివృద్ది నిధులు ఇవ్వకపోతే జనాల్లోకి ఎలా వెళ్ళాలని అక్కడి ఎమ్మెల్యేలుఅడుగుతున్నారు. వెలుగుల దీపావళి కావాలా? కర్ణాటక లాంటి చీకటి కావాలా అని   తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని అయన  అన్నారు.

congress-which-says-it-has-only-one-chance-should-be-advised-minister-harish-rao
congress-which-says-it-has-only-one-chance-should-be-advised-minister-harish-rao

ఆరు నెలల్లో అక్కడ 357 మంది కర్ణాటక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ తెలంగాణ లో రైతు ఆత్మహత్యకు తగ్గాయి.తెలంగాణలో మేము  రైతులం అని గర్వంగా చెప్పుకుంటున్నారు. గెలిచే దాకా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటారు., ఆ తర్వాత ఎక్స్ క్యూజ్ మీ  ప్లీజన్  అంటారు.ఒక్క ఛాన్స్ అంటున్న కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి. కర్ణాటక పరిస్తితి తెలంగాణ కు కావాలా ? రాహుల్ గాంధీ.. రాంగ్ గాంధీ అయ్యారు.  కర్ణాటక ఫెయిల్ మోడల్ చెప్పి ఇక్కడ ఓట్లు అడగాలని రాహుల్ గాంధీకి సవాల్ చేస్తున్నా. కర్ణాటక ఫెయిల్యూర్ మోడల్ రాహుల్ గాంధీ తీసుకొస్తున్నారు. కర్ణాటక ప్రజల్లగా తెలంగాణ ప్రజలు మోసపోరని అన్నారు. చిదంబరం మరోసారి తెలంగాణ ప్రజల మనుసు గాయం చేసేలా మాట్లాడారు. అమరవీరుల త్యాగాలను కించ పర్చెలా చిదంబరం వాఖ్యలు ఉన్నాయి. బేషరతుగా చిదంబరం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చిదంబరం తీరు ఎలా ఉంది అంటే, హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబులు వేసిన అమెరికా సారి చెప్పినట్టు ఉంది. స్వాతంత్రం పోరాటంలో ఎంతో మందిని కాల్చి చంపిన డయ్యర్ సారి చెప్పినట్టు ఉంది. ఆత్మబలిదానాలు చేసిన బిడ్డల తల్లిదండ్రులు కొరడాతో కొట్టినా కాంగ్రెస్ నాయకుల పాపం పోదని అయన అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్