భగవాన్ రామ్ లల్లా విరాజ్ మాన్
కౌతాళం : మండలం లో రామ జన్మభూమి అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం త్వరలో పూర్తి అయ్యి మహా ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న ఈ శుభ సందర్భంలో “భగవాన్ రామ్ లల్లా విరాజ్ మాన్” ను పూజించిన” పవిత్ర అక్షింతలు” జిల్లా కేంద్రం నుండి రెవెన్యూ మండలాలకు అలాగే కౌతాళం ప్రఖండకు కూడా ఆ పవిత్రమైన అక్షతలను జిల్లా నాయకులు అర్ధగేరి బసవనగౌడ్, హనుమంత రెడ్డి, ఇతర జిల్లా నాయకుల చేతులమీదుగా కౌతాళం విశ్వాహిందూ పరిషత్ నాయకులు చంద్రశేఖర్ జాగిర్దార్ కి అందజేయడం జరిగింది.ఈ పవిత్రమైన అక్షింతలను దగ్గరలోని దేవాలయంలో ఉంచి పూజాది కార్యక్రమాలను నిర్వహించి అయోధ్య రామ మందిర ట్రస్టు వారు నిర్ణయించిన పద్దతిలో మండల కేంద్రంతో పాటు మండలపరిధిలోని అన్ని గ్రామాలకు అక్షింతలతో పాటు అయోధ్య మందిరం యొక్క భవ్యమైన చిత్రపటం, సూచన పత్రాన్ని అందజేస్తామని చంద్రశేఖర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామాంజినేయులు హిందూ బంధువులు పాల్గొన్నారు.