తిరుపతి: తెలుగుదేశం పార్టీ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మంత్రి ఆర్కే రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టైయ్యారు. ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్న సంగతి తెలిసిందే. మంత్రి ఆర్కే రోజా సైతం బండారు సత్యనారాయణ మూర్తిని వదిలేది లేదు అని హెచ్చరిస్తున్నారు. పరువు నష్టం దావా వేయడంతో పాటు అవసరమైతే సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించి తానేంటో చూపిస్తానని శపథం చేసిన సంగతి తెలిసిందే. మంత్రి ఆర్కే రోజా తాను అన్నట్లుగానే టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తికి చుక్కలు చూపించేందుకు రెడీ అవుతున్నారు. తనపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ మంత్రి రోజా నగరి కోర్టులో పరువునష్టం కేసు పెట్టారు. మంత్రి ఆర్కే రోజా తన న్యాయవాదులతో కలిసి నగరి కోర్టులో ఫిర్యాదు చేశారు.మహిళలను ఏమైనా అనొచ్చు అనుకునే బండారు సత్యనారాయణ మూర్తిలాంటి మగవాడికి బుద్ధి చెప్పాలని తాను నిర్ణయించుకున్నట్లు మంత్రి ఆర్కే రోజా తెలిపారు. తనలాంటి ఒక మంత్రిని, ఒక ప్రముఖ నటిని అయిన తనను ఎదుర్కొనలేక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా తనను ఎదుర్కొనలేక పిచ్చిపిచ్చిగా వాగుతున్న బండారు సత్యనారాయణ, భాను ప్రకాశ్, ఓ మీడియా ప్రతినిధిలను వదిలిపెట్టేలది లేదని మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. గతంలోనే వీళ్లందరినీ హెచ్చరించానని అందులో భాగంగానే నగరి కోర్టులో పరువు నష్టం దావా కేసు పెట్టినట్లు వెల్లడించారు.
బండారును వదిలేది లేదు: రోజా
Published By Voice Today Team
158
- Advertisement -
- Advertisement -
- Tags
- bandaru comments on roja
- bandaru satyanarayana
- bandaru satyanarayana comments
- bandaru satyanarayana comments on minister roja
- bandaru satyanarayana comments on rk roja
- bandaru satyanarayana comments on roja
- bandaru satyanarayana murthy
- bandaru satyanarayana on roja
- bandaru vs rk roja
- bandaru vs roja
- rgv fires on bandaru satyanarayana
- roja vs bandaru
- roja vs bandaru satyanarayana
- tdp bandaru satyanarayana
- tdp leader bandaru satyanarayana



