నా తమ్ముడు బీర్ల ఐలయ్యను గెలిపించండి: విజయశాంతి

- Advertisement -

భువనగిరి (వాయిస్ టుడే ప్రతినిధి):- ప్రజాభిమాని,ఆత్మీయ ప్రజాభిమాని, అన్నా అంటే నేనున్నానని ప్రజల ముందుకు వచ్చే..బిర్లా ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ తత్పరుడైన నా తమ్ముడు బీర్ల ఐలయ్య ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య ప్రచారంలో భాగంగా ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ విజయశాంతి,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు,కాంగ్రెస్ నాయకుడు కుసుమ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ విజయశాంతి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు గెలిచిన గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నియోజకవర్గానికి చేసింది శూన్యమని, ప్రజలకు పనిచేసే నాయకుడే కావాలని అందుకు మీ ముందుకు వస్తున్న యువకుడు బీర్ల ఐలయ్యను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె కోరారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారని, ఇందులో భాగంగా నా తమ్ముడు బీర్ల ఐలయ్య గత 30 సంవత్సరాలుగా ఆలేరు నియోజకవర్గంలో ప్రజాసేవ చేస్తూ,ప్రజల ఆత్మీయ అభిమానిగా, ప్రజల మన్నలలను పొందిన బిర్లా ఐలయ్యకు ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఆమె ప్రజలను కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular