Monday, December 23, 2024

వైసీపీ గూటికి ముద్రగడ…

- Advertisement -

కాకినాడ, నవంబర్ 25, (వాయిస్ టుడే): రాజకీయనేతగా కంటే కాపు ఉద్యమనేత గానే ముద్రగడ పద్మనాభం సుపరిచితం. 1978 నుంచి 1989 వరకు నాలుగు సార్లు ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండుసార్లు మంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది. 1994లో తొలిసారిగా ఆయన ఓటమి చవిచూశారు. 1999, 2004 ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయగా.. ఒకసారి గెలిచి.. మరోసారి ఓడిపోయారు. 2009లో ప్రత్తిపాడు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చినా.. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ముద్రగడ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కూడా ఓటమి ఎదురైంది. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు పెద్దగా గుర్తించలేదు. దీంతో కాపు ఉద్యమాన్ని లేవనెత్తారు. టిడిపి ప్రభుత్వం పై గట్టిగానే పోరాటం చేశారు. ఈ క్రమంలో వైసీపీ గెలుపునకు పరోక్షంగా దోహదపడ్డారన్న టాక్ ముద్రగడపై ఉంది.2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఉన్నఫలంగా నిలిపివేశారు. గత నాలుగు సంవత్సరాలుగా ముద్రగడ వైసీపీలో చేరుతారని ఎప్పటికప్పుడు ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. ఆయన తరచూ వైసిపి నేతలు కలుస్తుంటారు. కానీ వైసీపీలో చేరిక మాత్రం ఆలస్యం అవుతోంది. అయితే జనసేన పవన్ వెంట కాపులు టర్న్ అవుతున్న నేపథ్యంలో.. ముద్రగడను పార్టీలోకి తెచ్చిఆ నష్టాన్ని అధిగమించాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ముద్రగడకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. వైసీపీలో చేరిక విషయంలో ముద్రగడ క్లారిటీ ఇవ్వనున్నారు.ఆ మధ్యన పవన్ వారాహి యాత్ర సమయంలో సవాళ్లు, ప్రతి సవాళ్లకు దిగిన సంగతి తెలిసిందే. తనపై పరోక్ష వ్యాఖ్యలు చేశారంటూ పవన్ పై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తనపై పిఠాపురం నుంచి పోటీ చేయాలని సవాల్ చేశారు. ఈ తరుణంలో పవన్ కూడా అదే స్థాయిలో స్పందించారు. ఒకవేళ పవన్ గాని పిఠాపురం నుంచి పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థిగా ముద్రగడ బరిలో దిగనున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్ పోటీ చేయకపోతే ముద్రగడ సైలెంట్ అవుతారని.. ఆయన కుమారుడు గిరిబాబు ప్రత్తిపాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. వచ్చే సంవత్సరం ఏపీ నుంచి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో.. ఒకదానిని ముద్రగడకు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ స్థానాలు విషయంలో కాపులకు ఇంతవరకు ప్రాతినిధ్యం దక్కలేదు. అందుకే ముద్రగడకు ఇచ్చి కాపులను కొంతవరకు ఉపశమనం కలిగించి తన వైపు తిప్పుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొద్దిరోజులు వ్యవధిలోనే ముద్రగడ వైసీపీలో చేరిక విషయమై స్పష్టత రానుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్