Thursday, March 12, 2026

కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలా?: హరీష్ రావు

- Advertisement -

రేవంత్ కు అవగాహన వుండదు: మంత్రి హరీష్ రావు

మహబూబాబాద్:  మహబూబాబాద్లో బీఆర్ఎస్ ఎమ్యెల్యే అభ్యర్ధి శంకర్ నాయక్కి మద్ధతుగా నిర్వహించిన రోడ్ షోలో  త్రి హరీశ్ రావు పాల్గోన్నారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీల మీటింగులు చూస్తే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నయి

బీఆర్ఎస్ మీటింగ్ అంటే జన సముద్రంలా ఉన్నయని అన్నారు. సమైక్య వాదులు దండయాత్రకు వచ్చిన రోజు మానుకోట ప్రజలు తరిమికొట్టారు.  మానుకోటకు మట్టికి దండం మానుకోట రాళ్లకు దండం.  మానుకోట దెబ్బతో సమైక్య వాదులు వెనుకకు పరిగెత్తారు.  మళ్లీ సమైక్యవాదులు ఒక్కటై తెలంగాణ మీద దండెత్తడానికి వస్తుండ్రు. వారికి మన మానుకోట దమ్మేంటో చూపించాలని అన్నారు.

కార్యకర్తలు మంచిగా పని చేసి శంకర్ నాయక్ ని మూడోసారి గెలిపించాలి. మానుకోట రోడ్లు సిద్ధిపేట కంటే బాగున్నాయి. గులాబీ జెండా లేకుంటే మానుకోట జిల్లా అయ్యేదా? మెడికల్ కాలేజ్ వచ్చేదా? హార్టికల్చర్ కాలేజ్ వచ్చేదా? తండాలు గ్రామ పంచాయితీలు అయ్యేవా? పోడు భూములకు పట్టాలు వచ్చేవా?  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కర్ణాటకలో ప్రచారం చేసి 5 గ్యారంటీలు అని ఊదరగొట్టి మోసం చేసిండ్రు. రేవంత్ రెడ్డికి ఏ విషయం మీద పూర్తి అవగాహన ఉండదు. కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి నెత్తిమీద కట్టాల్నా?  బూతులు మాట్లాడే నాయకులు కావాలా? భవిష్యత్తు అందించే నాయకుడు కావాలా?

Want Congress? Want Current?: Harish Rao
Want Congress? Want Current?: Harish Rao

నాడు కాల్వల్లో తుమ్మచెట్లు మొలిచినయి. నేడు రెండు పంటలకు పుష్కలంగా నీళ్లు వస్తున్నయి.  బోరింగులు మాయమైపోయినయి. ఇంటింటికీ నల్లా నీళ్లు వస్తున్నయి. నాడు దొంగ కరెంటు కోసం బాయి కాడ పండుకున్న రోజులు మర్చిపోయిండ్రా?  ఉచిత కరెంటు అని చెప్పి ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలా? కరెంట్ కావాలంటే కారుకు ఓటు గుద్దు. రిస్క్ వద్దు కారుకు గుద్దు.

రైతు బంధు విషయంలో కాంగ్రెస్ కుట్ర చేసింది. కేసీఆర్ చేసిన కృషి వల్ల  రైతు బంధు డబ్బులు సోమవారం రోజు ఖాతాల్లో పడతాయి. రైతులను బిచ్చగాళ్లు అన్న రేవంత్ రెడ్డికి రైతులే గుణపాఠం చెప్తరు

కాంగ్రెస్ మోసం చేసే పార్టీ. కేసీఆర్ అంటే మాట తప్పనోడు. ఇప్పటివరకు 90 శాతం హామీలను నెరవేర్చాం. రుణమాఫీ కూడా త్వరలో పూర్తి చేస్తాం. ఈ దఫా ఇళ్లు కట్టడంపై దృష్టి సారిస్తాం. మూడోసారి గెలిస్తే అసైన్డ్ భూములను పట్టా భూములుగా గుర్తిస్తాం. ఆసరా పెన్షన్లు 2 వేల నుంచి 5 వరకు పెంచుతాం. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తాం.  మహిళలకు 400కే గ్యాస్ సిలిండర్, ప్రతీ నెలా 3 రూపాయలు ఇస్తాం.  శంకర్ నాయక్ మాట కరుకు కానీ మనుసు మంచిది.  సిద్ధిపేటకు నేను తేలేని కాలేజీలను శంకర్ నాయక్ మహబూబాబాద్ కి తెచ్చుకున్నడు.  నా వల్లే కాని పనిని శంకర్ నాయక్ చేసి చూపించిండు. లంబాడీలకు అత్యధిక ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది కేసీఆరే. ఎస్సీ, ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్.  మీ ఆఖరి డిమాండ్ అయిన గిరిజన బంధును ఈ సారి పక్కాగా అమలు చేస్తామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్