హైదరాబాద్ నవంబర్ 25: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసిందని, ఆయనను తీవ్రంగా అవమానించిందని, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ చరిత్ర గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీకి ఏ మాత్రం అవగాహన లేకపోవడం నిజంగా దురదృష్ట కరమని అన్నారు.ఆయన మనందరం అభిమానించే వ్యక్తి అని, భూమి పుత్రుడని, తన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసిన అలాంటి మానవతామూర్తిని కాంగ్రెస్ పార్టీ దారుణంగా అవమానించిందని మంత్రి చెప్పారు.1996లో సిట్టింగ్ ప్రధానిగా ఉన్న పీవీ నర్సింహారావుకు ఎంపీ టికెట్ నిరాకరించి.. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించిందని మంత్రి తెలిపారు. పీవీ మరణించినప్పుడు కనీసం 24 అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి కూడా ఆయన భౌతిక కాయాన్ని అనుమతించకుండా అవమానించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఈ చరిత్ర గురించి ప్రియాంకాగాంధీకి అవగాహన లేకపోవడం దారుణమని అన్నారు. పీవీ కుటుంబానికి రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసింది: కేటీఆర్
Published By Voice Today Team
144
- Advertisement -
- Advertisement -
- Tags
- former indian prime minister
- former indian prime minister p. v. narasimha rao
- former pm narasimha rao's
- former pm narasimha rao's son passes away
- former pm narasimha rao's son pv rajeswara rao passes
- former pm pv narasimha rao
- former prime minister pv narasimha rao
- p. v. narasimha rao hated by the congress men?
- pv narasimha rao
- pv narasimha rao birth anniversary
- pv narasimha rao death anniversary
- pv narasimha rao economic reforms
- pv narasimha rao memorial



