వాయిస్ టుడే వరంగల్ జిల్లా బ్యూరో: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని అభ్నుస్ ఫంక్షన్ హాల్ లో ముస్లిం మైనార్టీ నాయకులు తెలంగాణలో జరుగుతున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి మైనార్టీ లందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ ని బలపరుస్తూ 30-11-2023 రోజున బ్యాలెట్ బాక్స్ లోని రెండవ నెంబర్ పై ఓటు వేసి కొండ సురేఖ ని అఖండ మెజారిటీతో గెలిపించడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు నాయకులు కొండా సురేఖ కి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా మైనార్టీ చైర్మన్ రాజ్యసభ మెంబర్ ఇమ్రాన్ ప్రతాప్ గరి, కర్ణాటక ఎమ్మెల్సీ జాఫర్ ఖాన్, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ దాల్వి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, కరీమాబాద్ దర్గా పీఠాధిపతి ఉబేద్ బాబా కాజీపేట దర్గా పీఠాధిపతి కుసుర్పాషా మరియు బషీర్ సెట్, సయ్యద్ వస్సిం, మహమ్మద్ అయుబ్, తాహేర్ తదితరులు, ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు బారి సంఖ్యలో పాల్గొన్నారు…



