బెంగళూరు, నవంబర్ 27, (వాయిస్ టుడే): చంద్రయాన్ – 3 తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో మిషన్ ఆదిత్య. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య మిషన్‌ను ఇస్రో చేపట్టింది. ఈ క్రమంలో ఆదిత్య ఎల్-1 ప్రయాణం తుది దశకు చేరుకుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. జనవరి 7 కల్లా ఆదిత్య వ్యోమనౌక ఎల్-1 పాయింట్‌కు చేరుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. ప్రస్తుతం తుది ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు.సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. 125 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సూర్యునికి సమీపంలో ఉన్న ఎల్-1 పాయింట్‌ను చేరుకునే లక్ష్యంతో దీన్ని ప్రయోగించారు. ఎల్-1 పాయింట్ నుంచి సూర్యుడి చిత్రాలను తీసి భూమికి పంపించనుంది. సూర్యుడిపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఇవి ఇస్రోకు ఉపయోగపడనున్నాయి.ఇలాంటి కరెక్షన్ను ఇస్రో చేపట్టడం ఇదే తొలిసారి సెప్టెంబర్ 19న చివరిసారిగా ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ మాన్యువర్‌ను పూర్తి చేసిన తర్వాత దాని ట్రాక్‌ను సరిచేయడానికి ఇది అవసరమని ఇస్రో పేర్కొంది. ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ చుట్టూ హాలో ఆర్బిట్ చొప్పించాల్సి వచ్చినట్లు ఇస్రో చెప్పింది. ట్రాజెక్టరీ కరెక్షన్ చేయడంతో ఆదిత్య-ఎల్1 అంతరిక్ష వాహక నౌక.. ఉద్దేశించిన మార్గంలో సాగుతోందనే విషయం నిర్ధారణకు వస్తుందని పేర్కొన్నారు. ఇంకొన్ని రోజుల్లో మాగ్నెటో మీటర్ మళ్లీ ఆన్ చేయనున్నట్లు వివరించింది. ఇదిలా ఉండగా.. ఆదిత్య-ఎల్1 మిషన్‌ను సెప్టెంబర్ 2న ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే.పీఎస్ఎల్ సీ-57 లాంచ్ వెహికిల్ నుంచి ఆదిత్య ఎల్-1ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగం నిర్వహించింది. ఆ తర్వాత కక్ష్యను మార్చుకుంటూ సూర్యుడి వైపు బయలుదేరింది. దాదాపు 120 రోజుల పాటు ప్రయాణించి లాగ్రేంజియన్ పాయింట్‌కు చేరుకోనున్నది. ఇది భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి సూర్యుడిపై అధ్యయనం చేయనున్నది. సౌర గాలులు, సౌర తుఫాన్లతో పాటు నక్షత్రాల అధ్యయనంలోనూ సహాయం అందించనున్నది. నక్షత్రాలు, గెలాక్సీ, ఖగోళ శాస్త్రానికి సంబంధించి అనేక రహస్యాలను అర్థం చేసుకోవడం సహాయపడనున్నది.
15 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఆదిత్య
Published By Voice Today Team
181
- Advertisement -
- Advertisement -
- Tags
- aditya l1
- aditya l1 launch
- aditya l1 launch video
- aditya l1 mission
- aditya l1 mission in hindi
- aditya l1 mission isro
- aditya l1 mission launch date
- aditya l1 mission reaction
- aditya l1 mission sun
- aditya l1 news
- aditya l1 solar mission
- aditya l1 solar mission launch
- aditya mission
- isro aditya l1
- isro aditya l1 mission
- isro aditya l1 mission launch date
- isro aditya l1 mission live
- isro aditya mission
- isro sun mission aditya l1
- what is aditya l1



