బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌కు నిరసన సెగ

- Advertisement -

ఐదేళ్ల కోసారి వస్తారా అంటూ అసహనం వ్యక్తం చేసిన ప్రజలు

హైదరాబాద్ నవంబర్ 28: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌కు నిరసన సెగ తగిలింది. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి  ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్‌‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రజలు నిలదీశారు. ఐదేళ్ల కోసారి వస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఐదేళ్లకు తమ వద్దకు వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ దానంకు ఓ యువకుడు పూలమాల వేసి వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశాడు. అయితే ఆ యువకుడిని మేయర్ సముదాయించే ప్రయత్నం చేశారు. ఐదేళ్లకైనా కనబడ్డాడు కదా అంటూ మేయర్ గద్వాల విజయలక్ష్మి నచ్చజెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular