రేపు ఎన్నికల పోలింగ్.. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వర్ష సూచన

- Advertisement -

తెలంగాణలో రేపు, ఎల్లుండి… రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనున్నట్లు తెలిపింది.

ఈ వాయుగుండం బంగాళాఖాతంలో వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని, దీంతో తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువవచ్చునని తెలిపింది.

హైదరాబాద్‌లో ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణం ఉండవచ్చునని, పరిసర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురువవచ్చునని తెలిపింది.

అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలకు తేలికపాటి వర్ష సూచన, దక్షిణ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular