మెదక్ జిల్లా: తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి రావెల్లి శివారులో దుండిగల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన శిక్షణ విమానం సోమవారం తెల్లవారుజామున కూలిపోయింది కూలిపోయిన విమానం పూర్తిగా కాలిపోవడంతో అందులో ఎంతమంది ఉన్నారు అన్న విషయం ఇంకా తెలియడం లేదు
తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి రావెల్లి శివారులో శిక్షణ హెలికాప్టర్ కూలింది. హైదరాబాద్‌కు చెందిన హెలికాప్టర్ సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కూలిపోయింది. భారీగా శబ్దం రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కూలిన శిక్షణ హెలికాప్టర్‌లో మంటలు చెలరేగడంతో ఒకరు లేక ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



