- Advertisement -
కరీంనగర్, డిసెంబర్ 4: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించానని సంతోషించేలోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు షాకిచ్చారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదైంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుండగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఓ హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదుతో కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఐపీసీ సెక్షన్ 506, 290, 353 ల కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగి ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని సమాచారం.
- Advertisement -