రేవంతన్న కథతో బయోపిక్ తీస్తా..

- Advertisement -

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆయన వీరాభిమాని. 2018 ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని బండ్ల గణేష్ స్టేట్ మెంట్ ఇచ్చారు..

ఒకవేళ కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడుతో కోసుకుంటా అని చెప్పారు. అయితే అప్పట్లో బీఆర్ఎస్ గెలవడంతో బండ్ల గణేష్ ఎక్కడ కనిపించినా బ్లేడు గురించి ప్రస్తావన తెచ్చేవాళ్లు. ఇప్పుడు కాలంతో పాటు ప్రభుత్వం కూడా మారింది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో బండ్ల గణేష్ ఆనందానికి హద్దులు లేవు. సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయనపై బండ్ల గణేష్ ఆసక్తి్కర వ్యాఖ్యలు చేశారు. రేవంతన్న అంగీకరిస్తే ఆయన కథతో సినిమా తీస్తానని ఏబీఎన్ లైవ్ డిబేట్‌లో స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డికి ఎంతో మంది విలన్‌లు ఉన్నారని.. ఆయన్ను జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారని బండ్ల గణేష్ అన్నారు. ఇబ్బందులు పెట్టిన చోటే నాయకుడిగా ఆయన అధికారం చేపడుతున్నారని అన్నారు..

Biopic with Revantanna's story..
Biopic with Revantanna’s story..

రేవంతన్నకు ఆకలి, కసి, కష్టం,పాలన తెలుసు అని బండ్ల గణేష్ అన్నారు. ట్విట్టర్‌లో కేటీఆర్ గన్ పట్టుకుని ఉన్న ఫోటో చూసి భయపడ్డానని.. కౌంటింగ్ కేంద్రాల దగ్గర అలర్టుగా ఉండమని కార్యకర్తలకు చెప్పానని.. కానీ గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్క స్థానం కూడా రాకపోవడం బాధాకరమని బండ్ల గణేష్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. కాంగ్రెస్ అద్భుత పాలన చేస్తుందని.. గ్రేటర్ వాసులు ఆదరించాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుందని బండ్ల గణేష్ అభిప్రాయపడ్డారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular