- Advertisement -
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఏనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కరీంనగర్ జిల్లా కోర్టు లో కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యం లో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. గురువారం జిల్లా కోర్టు అవరణ లో కాంగ్రెస్ లీగల్ సెల్ న్యాయ వాదులు సమావేశమై తెలంగాణ రాష్ట్రానికి నుతన ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి నియామకం పట్ల కాంగ్రెస్ లీగల్ సెల్ న్యాయవాదులు అర్. దేవేందర్ రెడ్డి, కొర్వి వేణుగోపాల్, పెంచాల లక్ష్మణ్ రావ్, కల్లేపల్లి లక్ష్మణ్, కృష్ణయ్య , కొత్త ప్రకాశ్, వేముల శ్రీనివాస్, ప్రదీప్ కుమార్, రమణ, కూర శ్రీనివాస్ రెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం స్వీట్ల పంపిణీ చేశారు.
- Advertisement -



