ఏఐటీయూసీ ప్రచారం
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరిఖని ఆర్ జీ 1 రెండవ బొగ్గు గని పై ఏఐటీయూసీ యూనియన్ గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు. ఏ యూనియన్ అయితే కార్మికుల హక్కులను కాపాడుతుందో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తుందో ఆ యూనియన్ ను వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపించాలని కార్మికులను కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ఏఐటీయూసీ కృషి చేసిందని, వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐ ఎన్ టి యు సి యూనియన్ తమకు మద్దతు తెలిపాలని ఆయన కోరారు. సింగరేణిలో కొత్తగనుల ఏర్పాటు కోసం, ఉద్యోగాల కల్పన కోసం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈసారి తమ యూనియన్ కి అవకాశం ఇవ్వాలని కార్మికులను కోరారు .