బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో
అందంతో కట్టిపడేసిన గుంటూరు కారం భామ….
హైదరాబాద్: చిల్లపల్లి వారి వీవర్లీ చేనేత స్టోర్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ప్రారంభం. సినీనటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ మగువలకు చీరలంటే మక్కువ నాకు కూడా శారీస్ అంటే చాల ఇష్టం. తెలుగువారికి మరింత ఎక్కువ. ఎందుకంటే శారీస్ లేడీస్ చక్కదనాన్ని పెంచుతాయి. వాళ్లకు నిండుదనాన్ని నింపుతాయి. అమ్మతనాన్ని అద్దుతాయి. మహిళల జీవితంలోని మధురమైన ఘట్టాలన్నీ చీరలతో “ముడి”పడి ఉన్నాయి. మనువు ముహూర్తం మొదలుకొని.. ముత్తైదువుతనం వరకు, నిశ్చితార్థం నుంచి శ్రీమంతం వరకు ప్రతి సందర్భంలోనూ వాళ్ల సంతోషానికి చీరలు అద్దంపడతాయి. ఇలా చెప్పుకుంటూపోతే చీరలోని గొప్పతనం అంతా ఇంతా కాదు. అలాంటి చీరలకు “వీవర్లీ” చిరునామాగా నిలుస్తోంది. ఈ స్టోర్ ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.

జనవరి లో గుంటూరు కారం సినిమా తో మీముందు వస్తున్న మహేష్ బాబు గారు యాక్ట్ చేయడం చాలా సంతోషంగా గా ఉంది.
వీవర్లీ స్టోర్ నిర్వహకులు చిల్లపల్లి నాగేశ్వరావు అండ్ సన్స్ మాట్లాడుతూ.. చేనేత చీరలకు ఐదు దశాబ్దాలుగా బ్రాండ్ నేమ్ మారింది. 1971లో ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ సంస్థకు విజయవాడలో మంగళగిరి లో చిల్లపల్లి హ్యాండ్లూమ్ స్టోర్స్ ఉన్నాయి. ఈరోజు బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లో కూడా “వీవర్లీ స్టోర్” పేరుతో షో రూమ్ ఓపెన్ చేసింది. పెళ్ళి పట్టు చీరలు కు వీవర్లీ ప్రత్యేకత. దేశవ్యాప్తంగా రూపొందించే చేనేత చీరలు ఇక్కడ లభిస్తాయి. హ్యాండ్వర్క్, హ్యాండ్లూమ్, ఫ్యాబ్రిక్ ఏదైనా దొరుకుతాయి.
చేనేత చీరలకు సంబంధించి మన దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వీవింగ్ యూనికెనెస్, ఒక్కో ప్రింటింగ్ స్టైల్ ఉంటుంది. వాటన్నింటినీ చిల్లపల్లివారు తమ దగ్గర అందిస్తున్నారు. ముఖ్యంగా హ్యాండ్ ప్రొడక్ట్స్ పైన ఫోకస్ పెట్టారు. 70 శాతం సొంత డిజైన్లనే విక్రయిస్తున్నారు. రెగ్యులర్ డిజైన్స్ ఇక్కడ చాలా తక్కువగా ఉంటాయి. వాటిని జనరల్ ఐటమ్స్ కేటగిరీలో అమ్ముతారు. వేరే శారీస్తో పోలిస్తే హ్యాండ్లూమ్ శారీస్ కొంచెం ఎక్కువ కాస్ట్లీ అని చెప్పొచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.



