హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారి జన్మదినం తెలంగాణ ప్రజలకు ఒక పండుని టీపీసీసీ ఛీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం గాంధీ భవన్ లో జరిగిన సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో అయన పాల్గోన్నారు. రేవంత్ మాట్లాడుతూ డిసెంబర్ 9, 2019లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఉక్కు సంకల్పంతో సోనియమ్మ మన ఆకాంక్షలు నెరవేర్చారు. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో.. మనం చూడలేదు. తెలంగాణ తల్లి సోనియమ్మ రూపంలో ఉంటుందని ఆ తల్లి మనకు భరోసా ఇచ్చిందని అన్నారు. తెలంగాణ ప్రజలు కృతజ్ఞత భావంతో ఉంటారని మొన్నటి ఎన్నికల తీర్పుతో నిరూపించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలు నాకు ఈ బాధ్యత ఇచ్చారు. సేవకుడిగా ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత నాది. కార్యకర్తలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఈ ప్రభుత్వం ప్రజలది.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన ఉంటుందని అన్నారు..


