పిఠాపురం: రాష్ట్ర ప్రజలు మూడు నెలల్లో ఈ వైసీపీ అరాచక పాలనను అంతమొందించి,తెలుగుదేశం,జనసేనపార్టీల కూటమికి అధికారం ఇవ్వనున్నారని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.యువగళం పేరున లోకేశ్ చేపట్టిన పాదయాత్ర మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఈ నెల 3న పిఠాపురం నియోజకవర్గం యూ.కొత్తపల్లి మండలం శీలంవారిపాకల వద్ద నిలిపివేసారు.అయితే.,శనివారం తిరిగి ఈ పాదయాత్ర శీరంవారిపాకల నుంచి ప్రారంభమైంది.తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి,పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పాదయాత్రలో లోకేశ్ తో కూడా అడుగులు వేశారు.ముందుగా మహిళలు నారా లోకేశ్ కి హారతులు పట్టారు.పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశంపార్టీ నాయకులు,కార్యకర్తలు వేలాదిగా ఈ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు.అలాగే.,పిఠాపురం నియోజకవర్గం జనసేనపార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ లోకేశ్ యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలియజేశారు.అడుగడుగునా ప్రజలు నారా లోకేశ్ కు బ్రహ్మరథం పట్టారు.తప్పెటగుళ్ళు,మేళతాళాలతో పాదయాత్రంతా మార్మోగిపోయింది.
మత్స్యకారుల సమస్యలపై మత్స్యకారులు కలిసి నారా లోకేశ్ కి వినతిపత్రం అందజేశారు.అదేవిధంగా మహిళలు కూడా వారి ఇబ్బందులను నారా లోకేశ్ కి విన్నవించుకున్నారు.కోనపాపపేట,శ్రీరాంపురం తదితర గ్రామాల మీదుగా ఈ పాదయాత్ర కొనసాగింది.భారీయెత్తున కార్యకర్తలు,అభిమానులు యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు.కాగా.,మత్స్యకారుల సమస్యలపైన,తీరప్రాంత గ్రామ ప్రజల సమస్యలపైన మాజీ ఎమ్మెల్యే వర్మ నారా లోకేశ్ కి వివరించారు.యూ.కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామ శివారుతో లోకేశ్ యువగళం పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలో ముగిసి,తుని నియోజకవర్గం తొండంగి మండలంలోకి ప్రవేశించింది.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ.,పిఠాపురం నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతీఒక్కరికీ కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలియజేశారు..