(డిసెంబర్ 10,23)వాయిస్ టుడే :ధర్మపురి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి మొదటి సారి ధర్మపురి కి విచ్చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం రాయపట్నం నుండి ధర్మపురి మున్సిపల్ లోని పలు వార్డుల్లో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం పటేల్ గార్డెన్స్ లో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని,తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలుపుతున్నామని,నేనే స్వయంగా ప్రతి గడప గడపకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకొని సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వ సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో ప్రతి పేదవారికి అందేలా చూస్తామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
నేనే స్వయంగా ప్రతి గడప గడపకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకొని సమస్యలను పరిష్కరిస్తా-ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
- Advertisement -
- Advertisement -



