Saturday, April 4, 2026

మళ్లీ కరోనా అలజడి.. ఒక్కసారిగా భారీగా పెరిగిన కేసులు..

- Advertisement -

ఢిల్లీ: కరోనా పూర్తిగా నామరూపాల్లేకుండా పోయిందని అనుకుంటున్న తరుణంలో, మరోసారి కేసుల పెరుగుదల హాట్ టాపిక్ గా మారింది. చాలా రోజుల తర్వాత మళ్లీ కొవిడ్‌ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో బయట పడ్డాయి.

24 గంటల వ్యవధిలో 166 మంది కొత్తగా కొవిడ్‌ మహమ్మారి బారిన పడ్డారు. ఈ 166 కొత్త కేసులలో అత్యధికంగా కేరళ రాష్ట్రం లోనే నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 895 కు చేరిందని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ.

మొన్నటి వరకు రోజువారీ కరోనా కేసుల సగటు 100 గా ఉంది. చలి కాలం కావడంతో ఇన్‌ప్లూయెంజా లాంటి వైరస్‌ల కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్రం చెబుతోంది.

ఇటీవల కరోనా పాజిటివ్‌ తో సిమ్లా ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ లో ఓ మహిళ మృత్యువాత పడినట్లు వెల్లడించింది.

కరోనా తీవ్రత తగ్గినప్పటి నుంచి దేశంలో అతి తక్కువ కరోనా కేసులు జూలై నెలలో నమోదయ్యాయని అధికారులు చెప్పారు. 2023 జూలై 24న కొత్త కరోనా కేసులు కేవలం 24 మాత్రమే రికార్డయ్యాయని తెలిపారు.

మొత్తానికి సడెన్ గా కరోనా కేసులు పెరగడంపై కేంద్రం అలర్టయ్యింది. జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సైతం సూచిస్తున్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్