న్యూఢిల్లీ, డిసెంబర్ 13: పార్లమెంట్ జీరో అవర్ జరుగుతున్న సమయంలో లోక్‌సభలోకి దూకి కలర్ స్మోక్ ను విసిరిన దుండగుడి వ్యవహారం సంచలనం అవుతోంది. సాగర్ శర్మ అనే ఆ యువకుడు విజిటర్స్ గ్యాలరీ నుంచి దూకిన తర్వాత ఎంపీల సీట్ల ముందుగా జంప్ చేస్తూ.. హంగామా చేశాడుు. ఈ క్రమంలోనే తన దగ్గర ఉన్న కలర్ స్మోక్ తీసి బయటకు విసిరేశాడు. షాక్‌కు గురైన ఎంపీలు కొంత మంది వెంటనే బయటకు వెళ్లేందుకు పరుగులు పెట్టారు. కానీ సభలోనే ఉన్న గోరంట్ మాధవ్ వెంటే ఆ దుండగుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కొద్ది సేపు ప్రయత్నించిన తర్వాత ఆ నిందితుడ్ని పట్టుకున్నాడు. చేతులు వెనక్కు విరిచి పట్టుకుని భద్రతా సిబ్బంది కి అప్పగించారు. మాధవ్ ను సహచర ఎంపీలు అభినందించారు. మాధవ్ మాజీ పోలీసు అధికారి. సీఐగా సర్వీసులో ఉండాగనే వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు. పోటీ చేసిన మొదటి సారే ఎంపీగా ఎన్నికయ్యారు. వివాదాస్పద ప్రవర్తనకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఆయన ఈ సారి పార్లమెంట్ లో ధైర్య సాహసాలు చూపి అందర్నీ ఆకట్టుకున్నారు.
ఆగంతుకడ్ని పట్టుకున్న గోరంట్ల
Published By Voice Today Team
131
- Advertisement -
- Advertisement -
- Tags
- cnn news18 latest news
- cnn news18 latest news updates
- day 2 of parliament monsoon session
- day 2 of parliament monsoon session latest news updates
- english news live
- inflation
- opposition holds protests at parliament
- opposition protests at parliament
- opposition protests at parliament latest news updates
- parliament monsoon session
- parliament monsoon session 2022
- parliament monsoon session 2022 day 2
- parliament monsoon session 2022 latest news updates
- price rise



