Sunday, March 29, 2026

నాబార్డ్ సహకారంతో సహకార సంఘాలకు శిక్షణ కార్యక్రమాలు…

- Advertisement -

Training programs for cooperatives in collaboration with NABARD…

* సహకార సంఘాల అభివృద్ధికి కేంద్రం పటిష్ట చర్యలు…

* నాబార్డ్ సహకారంతో సహకార సంఘాలకు శిక్షణ కార్యక్రమాలు…

* మీడియాతో తెలంగాణ,ఆంధ్ర రాష్ట్రల కోఆర్డినేటర్ డాక్టర్ ప్రొఫెసర్ ఎస్ఎల్ఎన్ టి శ్రీనివాస్..

కరీంనగర్:మానవవనరుల అభివృద్ధిలో
నేషనల్ కౌన్సిల్ ఫర్ కోపరేటివే ట్రైనింగ్ న్యుడిల్లి నూతన విధానాలను అనుసరిస్తోందని తెలంగాణ,ఆంధ్ర రాష్ట్రల కోఆర్డినేటర్ డాక్టర్ ప్రొఫెసర్ ఎస్ఎల్ఎన్ టి శ్రీనివాస్ తెలిపారు.కరీంనగర్ లో మీడియాతో రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో నిర్వహించబడుతున్న సంస్థ నేషనల్ కౌన్సిల్ ఫర్ కోపరేటివ్ ట్రైనింగ్ న్యూడిల్లి సంస్థ అని అన్నారు.దేశంలోని అన్ని రాష్ట్రాలలోను ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణముగా కార్యకలపములను నిర్వహిస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకున్న”సహకారం ద్వార సమృద్ధి అనే కార్యక్రమం “జాతీయ సహకార విధానం”ముసాయిదా రూపకల్పనలో ఎన్సిసిటి ప్రముఖపాత్ర వహిస్తుందన్నారు.ఈ సంస్థ ద్వార వివిధ సహకార రంగాలకి సంబంధించి ఒకేషనల్ డెవలప్ మెంట్ ప్లాన్స్ స్థానిక భాషలో తయారు చేస్తున్నారు. సహకార సంస్థల ఆర్ధిక అభివృద్ధికి కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ తీసుకున్న విధానములపై ఈ సంస్థ “అవగాహన సదస్సులు” అన్ని రాష్ట్రాలలోను ఏర్పాటు చేస్తోందని శ్రీనివాస తెలిపారు.ఈ సంస్థ ద్వార 2022-23 సం.లో దేశవ్యప్తంగా 3287శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాబడగా 2,01,507మంది సభ్యులు పాల్గొనడం జరిగిందన్నారు.2022-23 సం.లో వివిద ప్రముఖ్యమైన అంశాల (పన్ను రాయితీలు-మోడల్ బైలాస్)పై జాతీయ స్థాయిలో,రాష్ట్ర స్థాయిలో 565 సెమినార్స్,వర్క్ షాప్స్,వెబినార్ ని నిర్వహించారు.ఈ కార్యక్రమాలలో 64039మంది పాల్గోనటం జరిగిందన్నారు.నాబార్డ్” సహకారంలో 2022-23 సం,,లో దేశవ్యప్తంగా 280ప్రాధమిక వ్యావసాయ సహకార సంఘాలకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటుచేయగా,8145 సిబ్బంది పాల్గొన్నారు.దేశవ్యాప్తంగా ప్రాధమిక వ్యావసాయ సహకార సంఘములలోని సభ్యులకి సుమారుగా 10964మందికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.2022-23 సం.లో దీర్గకాలిక కోర్సులు అనగా ఎంబీఏ,పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అగ్రి –బిజినెస్ మేనేజ్మెంట్ నిర్వహించడం ద్వారా 4,364 మంది సభ్యులు లబ్ది పొందడం జరిగిందన్నారు.రానున్న రోజులలో సహకార రంగంలో అవసరమగు పరిశోధనలు,అధ్యయనాలను ప్రోత్సహించడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు.
భవిష్యత్ లో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ద్వారా పాడి పారిశ్రామిక,మత్స్య పారిశ్రామిక సహకార రంగంలోని సబ్యులకి, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి ఆయ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంలో ప్రణాళికలు తయారు చేస్తునామన్నారు.సహకార సంఘముల ఆర్ధిక బలోపేతానికి అవసరమగు చర్యలు,అదేవిధముగా ఆయా రాష్ట్రాల సహకార సంఘముల చట్టంలో తీసుకురావలసిన మార్పులు,సంబందిత మోడల్ బైలాస్ ని రూపొందించడములో, కేంద్ర సహకార మంత్రిత్వశాఖ తీసుకున్న విధానములపై అన్ని రాష్ట్రములలోను అవగాహన సదస్సుల ఏర్పాటులో ఈ సంస్థ ప్రముఖ పాత్రను పోషిస్తున్నదని రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్