మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి

- Advertisement -

మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి

మన సంస్కృతి, సంప్రదాయాలను, భారతీయ వారసత్వ సంపదను భావి తరాలకు అందించాల్సిన అవసరం మనందరిపై ఉందని శ్రీవీరభద్ర స్వామి సేవా సమితి ప్రధానకార్యదర్శి కాసుల వినోద్ అన్నారు. ఆదివారం నింబోలి అడ్డలో జరిగిన కార్యక్రమంలో శ్రీ వీరభద్రస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 18న సోమవారం ఉదయం 9 గంటలకు కర్మన్ ఘాట్ ఏపీఆర్ గార్డెన్స్లో జరగనున్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి కల్యాణ మహోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలను భక్తులకు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా కురవికి వెళ్లి వీరభద్రస్వామి కల్యాణాన్ని చూడలేక పోయిన భక్తులు ఈ కల్యాణ వేడుకల్లో పాల్గొనడానికి మంచి అవకాశం అని అన్నారు. కార్యక్రమంలో అద్దోజు చక్రపాణి, ఆర్థోజు ప్రకాష్, మధుసూదన్ చారి, మాధవ్ చారి, టి. భాస్కర్ రాజ్ గౌడ్, ఆర్.రాజేష్ కుమార్, బి.ఉపేందర్, టి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular