Friday, December 13, 2024

ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించండి

- Advertisement -

ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించం
డి

జిపి నిధుల దుర్వినియోగం పై చర్యలు తీసుకోండి

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కోరిన బుగ్గారం విడిసి

జగిత్యాల,
:గత దశాబ్ద కాలంగా మా బుగ్గారం గ్రామ ప్రజలంతా అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని, అందులో ముఖ్యమైన కొన్ని సమస్యలు మాత్రమే మీ దృష్టికి తీసుకు వస్తున్నామని వెంటనే వీటిపై స్పందించాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు బుగ్గారం గ్రామ అభివృద్ది కమిటి అధ్వర్యంలో మంగళ వారం విజ్ఞప్తి చేశారు.నూతన ఎమ్మెల్యే గా గెలుపొందిన తర్వాత లక్ష్మన్ కుమార్ మంగళ వారం మొదటి సారి బుగ్గారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోచమ్మ దేవాలయ ఫంక్షన్ హాల్ లో సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో  ఎంతో ఆత్మీయంగా ఆయనకు ప్రజలు ఘనంగా సత్కారం చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ది కమిటి అధ్వర్యంలో ముఖ్యమైన ప్రజా సమస్యలపై రూపొందించిన ఒక విజ్ఞాపన పత్రాన్ని అడ్లూరి లక్ష్మన్ కుమార్ కు అందజేశారు.
దయతో వెంటనే స్పందించి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనికోరారు.
బుగ్గారం గ్రామ పంచాయతీలో “దుర్వినియోగం” అయిన  “కోటికి పైగా నిధులపై”
వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని బాద్యులందరిని కఠినంగా శిక్షింప జేయాలని కోరారు. గత నాలుగేండ్లు గా అవినీతి మత్తులో నిర్లక్ష్యం వహిస్తున్న జిల్లా ఉన్నతధికారులపై కూడా చట్టపరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో 2013 డిసెంబర్ నెలలో జరిగిన దొంగ తనం కేసులో అన్యాయంగా కోరుట్ల లాకప్ డెత్ లో మృతి చెందిన “సాన చంద్రయ్య” కుటుంబాన్ని అప్పటి ప్రభుత్వ హామీల ప్రకారం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. అన్యాయంగా కేసుల పాలైన మరో ఇద్దరు యువకుల పరిస్థితి కూడా ఆలోచించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ దొంగతనం కేసు బయటకు తీసి అసలైన దొంగలకు శిక్ష పడేలా చేయాలని కోరారు.
గ్రామంలో సి.సి. రోడ్లు, డ్రైనేజీలు, డబుల్ రోడ్డు, డబుల్ రోడ్డు కు ఇరువైపులా డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ పనులు నాణ్యత లేకుండా, నాసి రకంగా, నిబంధనలు పాటించకుండా నిర్మించారు. వాటన్నింటిపై తగు విచారణ జరిపించి తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.
లోతు త్రవ్వి చేయాల్సిన డబుల్ రోడ్డు పనులు త్రవ్వకుండా నాలుగు ఫీట్లు ఎత్తుగా రోడ్డు నిర్మించడం వలన గ్రామస్తుల ఇండ్లు అన్నీ లోతట్టు ప్రాంతాలకు గురయ్యాయి. వర్షపు నీరు, మురికి కాలువల నీరు డ్రైనేజీ లోకి వెళ్ళక ప్రజలంతా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యాల పాలు అవుతున్నారు.
దీని వలన గ్రామ ప్రజలకు సుమారు 600 కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లుతోంది.
కావున వెంటనే తగు విచారణ జరిపించి గ్రామస్తులకు కలిగిన నష్ట పరిహారం అందజేసే ప్రయత్నం, సమస్య తీర్చే ప్రయత్నం చేయాలని మనవి చేశారు. బుగ్గారం గ్రామం మండలంగా ఏర్పడి “ఏడు ఏండ్లు” పూర్తయి పోయింది. కానీ కార్యాలయాల నిర్మాణానికి నోచుకోలేదు. వెంటనే మండలానికి కావలసిన కార్యాలయాలు అన్నీ గ్రామ నడి బొడ్డున నిర్మింప జేసి మండల ప్రజా సమస్యలు తీర్చాలన్నారు. మండలానికి జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి పిల్లల ఉన్నత విద్య కొనసాగేందుకు కృషి చేస్తారని ఆశించారు.

ఎస్సీ – ఎస్టీ హాస్టల్ కు పూర్తి స్థాయి వార్డెన్ లేకపోవడం వలన తగు విద్యార్థుల సంఖ్య లేక మూత పడే ప్రమాదం పొంచి ఉందన్నారు. వెంటనే వార్డెన్ ను నియమింపజేసి హాస్టల్ ను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
జనాభా లెక్కన ఆరు అంగన్ వాడీ సెంటర్లు ఉండాలి కానీ మూడే సెంటర్లు ఉన్నాయని మిగతా మూడు అంగన్ వాడీ సెంటర్లు ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అధికారుల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల సంఖ్య సరిగా లేక మూత పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే సిర్వంచకోట నుండి తెచ్చుకున్న ఒక ప్రాథమిక పాఠశాల మూత పడ్డది. తక్షణమే తగు చర్యలు తీసుకొని పేద విద్యార్థినీ – విద్యార్థులకు తగు న్యాయం చేసి ఆ రెండు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కాపాడాలన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాన్ని వెంటనే పూర్తి స్థాయిలో కనీసం 20 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయించి, వైద్యులను, సిబ్బందిని నియమించాలని కోరారు.
వరిధాన్యం అమ్మకాలకు సరైన స్థలం లేక రైతులు అనేక కష్ట – నష్టాలు పడుతున్నారు. వెంటనే ఊరగట్టు ప్రాంతంలో కనీసం 10 ఎకరాల స్థలం చదును చేసి రైతులకు సకల సౌకర్యాలతో బీట్ ఏర్పాటు చేయాలన్నారు.
బుగ్గారం మండల రైతుల కోసం ప్రత్యేకంగా బుగ్గారంలోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని కోరారు.
ఐకెపి, పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు అనేక మోసాలకు గురయ్యారు. ఐకెపి కొనుగోళ్ల కమీషన్ డబ్బులు కూడా గ్రామ మహిళలకు అందలేదన్నారు. లెక్కల్లో అనేక గోల్ మాళ్లు జరిగాయని, వాటిపై సరైన విచారణ జరిపించి రైతులకు, మహిళలకు న్యాయం చేసి, దోషులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.

బుగ్గారం గ్రామంలో ఏ ఒక్క ఇంటికి నల్ల రావడం లేదు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పైపు లైన్ లు, అన్నీ మాయం చేశారు. కొత్తగా పైపు లైన్ లు వేయించి ఇంటింటికీ నల్లా నీళ్ళు వచ్చేలా చేయాలని కోరారు.. బుగ్గారం ప్రధాన రోడ్డు గుంతలతో అనేక ఇబ్బందులు, ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.  వెంటనే ఎక్స్ రోడ్డు వరకు డబల్ రోడ్డు పనులు చేయించి ప్రజల కష్టాలు తీర్చాలని కోరారు.
బుగ్గారం మండలంలోనే అతి పెద్దగా జరిగే మహా శివరాత్రి జాతర ఉత్సవాలు నిర్వహించుటకు, కళ్యాణ వేదిక కు, శివదీక్షా స్వాముల సౌకర్యానికి అనుకూలంగా  శ్రీ సాంబశివ నాగేశ్వరాలయం వద్ద పెద్ద కళ్యాణ మంటపం నిర్మింప జేయాలన్నారు.
బుగ్గారంలో తూర్పు వాడకు స్మశాన వాటిక నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. బుగ్గారం గ్రామంలోని రెండు బస్టాండ్ల వద్ద బస్ షెల్టర్లు – మరుగు దొడ్లు నిర్మించాలని కోరారు.
బుగ్గారం ఎక్స్ రోడ్డు వద్ద ఎక్స్ ప్రెస్ బస్ లు ఆగేలా బస్ స్టాప్ ఏర్పాటు చేయించాలన్నారు. పడమటి వాడలోని ఊర కుంట చెరువుకు సిమెంట్ తో మత్తడి నిర్మించి శాశ్వతంగా ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు తొలగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ది కమిటి యొక్క కోర్ కమిటి చైర్మన్ చుక్క గంగారెడ్డి, కో – చైర్మన్ లు పెద్దనవేని రాగన్న, విలాసాగరం నందయ్య, విడిసి అధ్యక్షులు నక్క చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి పెద్దనవేని రాజేందర్, కోశాధికారి:  సీగిరి అంజన్న, ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్, మహమ్మద్ అహ్మద్, సహాయ కార్యదర్శులు తిరునగరి విద్యా సాగర్, కాశెట్టి మహేష్, ప్రచార కార్యదర్శులు కళ్లెం నగేష్ కుమార్, గుర్రాల గంగారాం, సాంస్కృతిక కార్యదర్శి నక్క రాజ పోచయ్య కార్యవర్గ సభ్యులు నగునూరి పెద్ద రామన్న గౌడ్, కొడిమ్యాల రాజన్న, కేతి లచ్చయ్య, మసర్ధి నర్సయ్య, ముత్తినేని పోచన్న, గొడిశెల చిన్న నారాయణ గౌడ్, సుంకం గంగారెడ్డి, జంగ రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్