లేడీస్ హాస్టల్ లో ర్యాగింగ్ కలకలం

- Advertisement -

లేడీస్ హాస్టల్ లో ర్యాగింగ్ కలకలం
వరంగల్, డిసెంబర్ 21,
కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపింది. వర్సిటీ లేడీస్ హాస్టల్ లో పరిచయ కార్యక్రమం పేరున సీనియర్ విద్యార్థినులు జూనియర్లను ఇబ్బందులకు గురి చేయడం, వెకిలి చేష్టలకు పాల్పడటంతో అది కాస్త వివాదానికి దారి తీసింది.కాకతీయ వర్శిటీ లేడీస్ హాస్టల్లో ర్యాగింగ్ వ్యవహారం కేయూ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా వారు వెంటనే అప్రమత్తమయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.కేయూలో విద్యార్థినులకు వసతి కల్పించడం కోసం ఐదు హాస్టల్స్ ఏర్పాటు చేశారు. పద్మాక్షి ఏ, బీ, సీ, డీ, ఈ అనే బ్లాక్ లు విద్యార్థినుల కోసం కేటాయించగా.. వాటిల్లో రెగులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు సంబంధించిన దాదాపు 1,800 మంది విద్యార్థినులు మెస్ కార్డ్స్ తీసుకుని చదువుకుంటున్నారు.కొత్తగా వివిధ కోరుల్లో చేరిన విద్యార్థినులను పద్మాక్షి బ్లాక్ ఏ బ్లాక్ వద్ద కొందరు సీనియర్లు జూనియర్ విద్యార్థినులను ఇబ్బందులకు గురి చేసినట్లు తెలిసింది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తో పరిచయ కార్యక్రమంగా మొదలు పెట్టి.. ఇష్టానుసారంగా ప్రశ్నలతో పాటు వెకిలి చేష్టలకు పాల్పడినట్టు సమాచారం. దీంతో సీనియర్ల వెకిలి చేష్టలకు ఇబ్బంది పడిన కొందరు విద్యార్థులు విషయాన్ని వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.గత ఫిబ్రవరి నెలలో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వేధింపుల వల్ల డాక్టర్ ప్రీతి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వేధింపులకు పాల్పడిన నిందితుడు సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేసి చర్యలు తీసుకున్నారు. కాగా ఈ వ్యవహారం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.తాజాగా కేయూ క్యాంపస్ లో ర్యాగింగ్ జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తగా.. సాటి విద్యార్థినులపై సీనియర్ల వేధింపులకు పాల్పడిన విషయం వర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ర్యాగింగ్ విషయం బయటకు రాకుండా అధికారులు రహస్యంగా చర్యలు చేపట్టినట్లు తెల్సింది. కొంతమంది విద్యార్థినులతో వర్సిటీ హాస్టల్ అధికారులు మాట్లాడి వివరాలు సేకరించినట్టు సమాచారం. దీంతో కొంతమంది విద్యార్థినులు తమను ప్రశ్నలతో ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని హాస్టల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. వారి నుంచి వివరాలు సేకరించిన ఆఫీసర్ లు జూనియర్ల పట్ల వెలికి చేష్టలకు పాల్పడిన విద్యార్థినులను హెచ్చరించినట్లు సమాచారం.కేఎంసీ ఘటనల నేపథ్యంలో కేయూ క్యాంపస్ లోనూ అధికారులు యాంటీ ర్యాగింగ్ సెల్ మీటింగ్ లు నిర్వహించాల్సి ఉండగా.. వర్సిటీ అధికారులు పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular