Saturday, February 14, 2026

ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఐఎన్టీయూసీకే మద్దతు

- Advertisement -

ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఐఎన్టీయూసీకే మద్దతు

కమాన్ పూర్
సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఐఎన్టీయూసీకే మద్దతు ఇవ్వడం జరుగుతుందని కేంద్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్ బత్తుల శంకర్ బొక్కల శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆర్జీ 3 ఓసిపి వన్ బేస్ వర్క్ షాప్ లో ఐఎన్టీయూసీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తోపాటు ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల నాయకులు ఇరుగు రాళ్ల శ్రీనివాస్ బొక్కల శ్రీనివాస్ బత్తుల శంకర్లు శ్రీధర్ బాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఐఎన్టీయూసీకి పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని వారు శ్రీధర్ బాబుకు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఐఎన్టీయూసీ ఆర్ జి త్రీ ఉపాధ్యక్షుడు కోట రవీందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ ఐఎన్టీయూసీ నాయకుడు శ్రీనివాస రావు గట్టయ్య పివి గౌడ్ పిన్నింటి రాంరెడ్డి  కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడువైనాల రాజు శివ శంకరయ్య మాతంగి సదానందం ఇరుగు రాళ్ల కుమార్ తో పాటు కాంగ్రెస్ నాయకులు ఐఎన్టిసి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్