అంగన్వాడి 18 వ రోజు సమ్మెకు మద్దతు తెలిపిన టిడిపి మాజీ ఎమ్మెల్యే భూమా
నంద్యాల
నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 18 వ రోజు నిరవధిక సమ్మెకు నంద్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి మద్దతు తెలిపారు.
భూమా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలను అమలుచేయకుండా మాటలు చెబుతూ,ప్రగల్భాలు పలుకుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలక్షేపం చేస్తున్నారని,అంగన్వాడీ వర్కర్స్ కనీస వేతనం,రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయలన్నారు, వారు పనిచేసిన కాలానికి ఇప్పటి వరకు జీతం కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు.అంగన్వాడీ వర్కర్స్ కి టీడీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేసారు.*
ఈ కార్యక్రమంలో గోస్పాడు మండల కన్వీనర్ చంద్ర శేఖర్ రెడ్డి,రైతు సంఘం నాయకులు బాలీశ్వర రెడ్డి,గోస్పాడు వెంకటేశ్వర రెడ్డి,మాజీ ఎంపీటీసీ పల్లపురం పెద్ద హుస్సేన్ సా ,చిన్న హుస్సేన్ సా, ప్రసాద్ రెడ్డి,దూదేకుల మౌలాలి,ఒంటివేలగల శీలం వీర రెడ్డి,జిలెల్ల ఈశ్వర్ రెడ్డి,నారాయణ రెడ్డి,శంకర్ రెడ్డి,చింతకుంట్ల విశ్వేశ్వర రెడ్డి, ఐటీడీపీ అధ్యక్షుడు నాగార్జున రెడ్డి,దీబగుంట్ల ఈశ్వర్ రెడ్డి,సాంబవరం మద్దిలేటి రెడ్డి,కుమార్ రెడ్డి,రాయపాడు మౌళీశ్వర రెడ్డి,యళ్ళురు వెంకట్ రెడ్డి, గోపాల కృష్ణ, జూలేపల్లె సుదర్శన్ రెడ్డి,భాస్కర్ రెడ్డి, పసులపాడు తులసిశ్వర రెడ్డి,రమేష్, వెంకటేశ్వర్లు, నాగులవరం మహనది రెడ్డి, చెన్నయ్య , నెహ్రునగర్ నాయకులు, బీవీ నగర్ నాయకులు మరియు నంద్యాల పట్టణ నాయకులు రాంపల్లె రామిరెడ్డి,మారం వినయ్ కుమార్,చలపతి, అమిదెలా చందు, బోయ వెంకటేశ్వర్లు, నంద్యాల మండల నాయకులు మహేంద్ర రెడ్డి,భోగేశ్వర రెడ్డి మరియు గోస్పాడు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపారు.



