- Advertisement -
బస్సులో ఘోరంగా కొట్టుకున్న మహిళలు
కర్నాటక సీను రిపీట్
వరంగల్
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. అదే సమయంలో సీట్ల కోసం గొడవలూ జరుగుతున్నాయి. కర్నాటక సీన్లు తెలంగాణలో రిపీట్ అవుతున్నాయి తాజాగా వరంగల్బస్సులో ఇద్దరు మహిళలు ఘోరంగా కొట్టుకున్నారు. వరంగల్ నుంచి నర్సంపేట వెళ్తున్న బస్సులో మహిళలు పెద్దసంఖ్యలో ఎక్కారు. ఈ క్రమంలో ఓ మహిళ తాను ముందే ఆపుకున్న సీట్లో మరో మహిళ కూర్చోవడంతో గొడవకు దిగింది. మాటామాటా పెరిగి జుట్లు పట్టి కొట్టుకున్నారు.
- Advertisement -



