సీనియర్ సీటీజన్స్ సమాజ మార్గదర్శకులు
కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష
జగిత్యాల
సీనియర్ సీటీజన్స్ సమాజ మార్గదర్శకులని కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సీటీజన్స్,
పెన్షనర్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖల ప్రతినిధులు అసంఘాల రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ను కలిసి 2024 నూతన సంవత్సరం సందర్భంగా కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ సీటీజన్స్,పెన్షనర్స్ అస్సోసియేషన్ ల 2024 క్యాలెండర్ లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వయోవృద్దులకు సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు అందిస్తున్న సేవలను అభినందించారు. .అనంతరం హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్,వయో వృద్ధుల అప్పిలేట్ చైర్మన్ షేక్ యాస్మిన్ భాష ఆధ్వర్యంలో జగిత్యాల ,కోరుట్ల,మెట్ పల్లి ట్రిబ్యునల్ చైర్మన్ లు నర్సింహ మూర్తి,సోమ రాజేశ్వర్,దూలం మధులు సీనియర్ సిటీజేన్స్ కేసుల పరిష్కారం లో రాష్ట్రములో నెంబర్ వన్ గా నిలిచినందుకు అభినందనలు తమ అస్సోసియేషన్ తరపున తెలిపారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ సీనియర్ సీటీజన్స్,పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, ట్రెసా జిల్లా అధ్యక్షుడు ఎం.డి.వకీల్,టీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భోగ శశిధర్, పెన్షనర్స్ జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్,
సీనియర్ సీటీజన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,ఉపాధ్యక్షులు పి.సి.హన్మంత్ రెడ్డి,ఎండి.యాకూబ్, నాయకులు ప్రకాష్ రావు, ,పి.ఆశోక్ రావు,దేవేందర్ రావు, ఎం.డి.ఎక్బాల్,, కరుణ,తదితరులు పాల్గొన్నారు.