ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం
13 వ వార్డులో ప్రజాపాలనలో కౌన్సిలర్ తిరుమల వసంత
కోరుట్ల,
ప్రజల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన కార్యక్రమం ప్రవేశపెట్టిందని
13 వ వార్డు కౌన్సిలర్ తిరుమల వసంత ఆన్నారు.. మంగళవారం
పట్టణంలోని 13వ వార్డులో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో కౌన్సిలర్ తిరుమల వసంత- గంగాధర్, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అభ్యర్థి నుండి
నుండి దరఖాస్తులు తీసుకుని అధికారులకు అందజేశారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేయడం జరిగిందని మిగతా గ్యారంటీలను ప్రజాపాలన కార్యక్రమం ద్వారా స్వీకరిస్తూ త్వరలోనే అమలు పరుస్తామన్నారు..
అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు .కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడే పార్టీ అని కొనియాడారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ,ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



