జిల్లాలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలి
అక్రమ ఇసుక రవాణాను అరికట్టి, నిర్మాణ రంగం పై అదనపు ఆర్థిక భారం తగ్గించాలి
జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి విజ్ఞప్తి
జగిత్యాల,
భవన నిర్మాణ రంగంలో ఇసుక ప్రాధాన్యతను వివరిస్తూ, ఇసుకను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు జిల్లా కేంద్రంలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి జగిత్యాల
జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు.
ఈ మేరకు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ భవనంలో బుధవారం జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషను కలిసి లేఖ అందజేసి, ఇసుక కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ
సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో గతంలో నిర్వహించిన ఇసుక స్టాక్ పాయింట్ ను సంవత్సర కాలంగా నిలిపివేయడంతో భవన నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుక అందుబాటులో
లేకపోవడంతో
ప్రైవేట్ గా ఇసుక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని, దీంతో భవన నిర్మాణాలు చేపట్టే వారిపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ఎమ్మెల్సీ వివరించారు.
గతంలో జగిత్యాలలో నిర్వహించిన ఇసుక
స్టాక్ పాయింట్ ను తిరిగి ప్రారంభిస్తే, ఇసుక అక్రమ రవాణా నిలువరించడం తోపాటు, నిర్మాణ రంగానికి ప్రభుత్వపరంగా ఇసుక అందుబాటులోకి వస్తుందని తద్వారా నిర్మాణ రంగంపై పడే అదనపు ఆర్థిక భారం కూడా తగ్గే
అవకాశం ఉంటుందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.గతంలో ఇసుక స్టాక్ పాయింట్ దరూరు క్యాంపు రామాలయం సమీపంలో నిర్వహించారని, ఆ స్థలాన్ని ప్రస్తుతం ప్రభుత్వపరంగా ఇతర అవసరాలకు వినియోగిస్తున్న
నేపథ్యంలో జగిత్యాల పట్టణంలో ఇసుక స్టాక్ పాయింట్ కోసం మరోచోట స్థలాన్ని గుర్తించాలన్నారు.
జగిత్యాల పట్టణంలో రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన అందుబాటులో ఉన్న సుమారు ఐదు ఎకరాల స్థలాన్ని
పరిశీలించాలని అన్నారు.నిర్మాణ రంగానికి ఇసుకను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు జగిత్యాల పట్టణంలో
ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా కలెక్టర్
యాష్మిన్ భాషాకు విజ్ఞప్తి చేశారు.