Thursday, February 26, 2026

 సంక్రాంతికి టీడీపీ, జనసేన లిస్ట్..

- Advertisement -

 సంక్రాంతికి టీడీపీ, జనసేన లిస్ట్..
విజయవాడ, జనవరి 6,
లుగుదేశం-జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. ఇరుపార్టీలకు అమోదయోగ్యమైన రీతిలో సీట్ల సర్దుబాటు ఉంటుందని టీడీపీ చెబుతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్టేనని స్పష్టం చేశారు. వారం పదిరోజుల్లో జాబితాను విడుదల చేస్తామన్నారు.అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ ప్రచార కార్యక్రమాలలో దూకుడు పెంచడం, అభ్యర్థుల మార్పులు, చేర్పులతో జాబితాలను ప్రకటిస్తూ హడావుడి చేస్తోంది. మరోవైపు టీడీపీ-జనసేన కూటమి ఖరారైన ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే విషయంలో మాత్రం స్పష్టత కొరవడింది.అభ్యర్థులను అధికారికంగా ప్రకటించక పోవడంతో ఎవరితో ఎక్కడ చేస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది. పిఠాపురం, అనకాపల్లి వంటి ప్రాంతాల్లో టీడీపీ-జనసేన సమన్వయ సమావేశాలు రసాభాసగా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జాబితా విడుదలపై స్ఫష్టత ఇచ్చారు.వారం పదిరోజుల్లోనే జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. జనసేనతో సీట్ల సర్దుబాటు విషయంలో ఎలాంటి పేచీ లేదని స్పష్టం చేశారు. జనసేన నుంచి కూడా సానుకూల స్పందన ఉందని, ఇరుపార్టీలకు అమోదయోగ్యంగానే సీట్ల సర్దుబాటు ఉంటుందని చెప్పారు. జనసేన నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.పరస్పర అవగాహనతోనే ముందుకు వెళుతున్నామని చెప్పారు.స్థానికంగా బలాబలాలను బేరీజు వేసుకుని పట్టువిడుపులతో ముందుకు వెళుతున్నట్టు చెప్పారు. చాలా నియోజక వర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం ప్రత్యేకంగా లేదని అక్కడ అభ్యర్థి ఎవరనే విషయంలో క్యాడర్‌కు స్పష్టత ఉందని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావు లేదని చెప్పారు. జనసేన-టీడీపీ కూటమి తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చిందని, ఇరు పక్షాల మధ్య చర్చల తర్వాత దానిని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.ఎన్నికల ప్రచారం వెనుకబడిపోతున్నామనే ఆందోళన తమకు లేదని, టీడీపీ మీద ఎలాంటి ఒత్తిడి లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తమ పార్టీకి సానుకూలంగా ఉందని చెప్పారు. ప్రశాంత్‌ కిషోర్‌తో సంప్రదింపులు జరపడం పెద్దగా ప్రాధాన్యత ఏమి లేదన్నారు.ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత మిగిలిన విషయాలన్ని చిన్నచిన్న అంశాలేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. ప్రశాంత్ కిషోర్‌తో భేటీ రొటీన్‌ పొలిటికల్ ఎక్స్‌ర్‌సైజ్‌ మాత్రమేనని చెప్పారు. పార్టీ పని పార్టీ నాయకులు చేసుకుంటూ పోతారని చెప్పారు.రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్