అల్ఫోర్స్ ఇ-టెక్నో విద్యార్థి జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక

- Advertisement -

అల్ఫోర్స్ ఇ-టెక్నో విద్యార్థి జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక

కరీంనగర్

జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొనడం ద్వారా ఖ్యాతి లభిస్తుందని, పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపకరిస్తుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారంస కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో పాఠశాలకు చెందినటువంటి విద్యార్థి జాతీయ స్థాయి హాకి పోటీలకు ఎంపికైన సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అభినందన సభకు ముఖ్య అతిధిగా ఆయన  హాజరయ్యారు..
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ క్రీడా అయిన హాకీ పట్ల ప్రతిఒక్కరు ఆసక్తి ప్రదర్శించాలని, వివిద స్థాయిలలో నిర్వహింపబడే వివిధ పోటీలలో విజయపరంపరను కొనసాగించి భవిష్యత్కు మంచి పునాది వేసుకోవాలని సూచించారు. హాకీలో ఎన్నో విషయాలు నేర్చుకునేవి ఉంటాయని ప్రత్యేకంగా విజయాలను సాధించే విధానాలను తెలుసుకుంటామని చెప్పారు. క్రీడల్లో లభించే లాభాలు మరే ఇతర అంశాల్లో సాధ్యం కాదని చెప్పారు. హాకీ ఆడే ప్రతి క్రీడాకారుడు ద్యాన్చంద్ను ఆదర్శంగా తీసుకొని ఘన విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. వారి పోరాట పటిమ ఏకాగ్రత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ప్రాథమికంగా విద్యార్థులకు పాఠశాలలో ఎంపిక పరిక్ష నిర్వహిస్తామని అందులో ప్రతిభను కనబరచిన వారికి పోటీలకు ఎంపిక చేస్తామని వారు చెప్పారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో హైద్రాబాద్లోని జిమ్న స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర హాకీ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి జాతీయ స్థాయి ఎంపిక పోటీలలో పాఠశాలకు చెందినటువంటి ఎ. కృతిక్ పటేల్, 4వ తరగతి, అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే కాకుండా త్వరలో రాజస్థాన్లో నిర్వహింపబడే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడం చాలా గొప్ప విషయమన్నారు.అత్యుత్తమ విజయాలను నమోదు చేసి క్రీడా స్పూర్తిని పెంపొందించాలని ఆకాంక్షించారు. అదేవిదంగా విజేతకు పుష్పగుచ్చంతో పాటు అర్హత పత్రంను అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular