సమక్క సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు
ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర నిర్వహణ
జాతర నిర్వహణ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ సమీక్ష
పెద్దపల్లి
జిల్లాలో నిర్వహించే సమక్క-సారలమ్మల జాతరకు ప్రణాళికాబద్ధంగా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక సంస్థల
అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలో నిర్వహించే సమక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై సింగరేణి కాలరీస్, ఎన్టిపిసి,
రామగుండం మున్సిపాలిటి, రెవెన్యూ, సమక్క-సారలమ్మ బోర్డ్ మెంబర్లతో సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే సమక్క సారలమ్మ జాతర జిల్లాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు
కలగకుండా కట్టుదిట్టంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. జాతర నిర్వహించే ప్రదేశాన్ని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా కార్యాచరణ
వివిధ డిపార్ట్మెంట్ల వారీగా తయారు చేయాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని అదనపు పారిశుధ్య వర్కర్లను నియమించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
జాతర నిర్వహణకు
సంబంధించి అవసరమైన నిధుల ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలని, జిల్లాలో ఉన్న సింగరేణి, ఎన్టీపీసీ వారిచే నిధులు అలాట్ చేసే విధంగా సమన్వయం చేసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతుందని
అదనపు కలెక్టర్ తెలిపారు. జాతర నిర్వహణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మరో సమావేశం నిర్వహించాలని, జాతర సమయంలో తప్పనిసరి గా కంట్రోల్ రూమ్ ఏర్పాటు
చేయాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించే యంత్రాంగం తయారు చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి రెండు
సంవత్సరాలకు ఒకసారి శ్రీ సమక్క – సారలమ్మల జాతరను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 24 వరకు మూడు ప్రాంతాలలో జాతర నిర్వహించు టకు ప్రభుత్వం నిర్ణయించిందని,
అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకునే ఈ జాతరను విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధం కావాలని అన్నారు. స్త్రీలు దుస్తులు మార్చుకోవ డానికి గదులు
ఏర్పాటు, విద్యుత్ దీపాలంకరణ సాయంత్రం నుండి ఉదయం వరకు నిరంతరాయంగా సాగేటట్లుగా చూడాలని, విద్యుత్ అంతరాయం కల్గకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని, గోదావరి నదీ ప్రాంతంలో సేప్టి
ఫెన్సీంగ్ ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. జాతర జరుగు నాలుగు రోజులు వైద్య సిబ్బంది,108 వాహనం, మందులు అందుబాటులో ఉంచాలని, ఫైర్ ఇంజన్ 24 గంటల పాటు షిప్టు డ్యూటిలలో
అందుబాటులో ఉంచాలని తెలిపారు. జాతర జరుగు ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ ఇబ్బంది కల్గకుండా చూడాలని,అవసరమైన చోట సిసి కెమెరాలను
ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ పోలీసు శాఖ వారిని ఆదేశించారు. పుణ్యస్నానాలు చేసే వద్ద గజఈతగాల్లను అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ శాఖల సిబ్బందికి భోజన ఏర్పాటు, జాతర ప్రారంభానికి వి.ఐ.పి.ల
ఆహ్వనం, పబ్లిక్ అడ్రెస్ సిస్టం ఏర్పాటు, నిర్వహణ వంటి పనులు దేవాదాయ శాఖ వారు నిర్వహించాలని, గోదావరిఖని ఆర్టిసి డిపో మేనేజరు జాతర జరుగు ప్రాంతాలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక
బస్సులు నడపాలని, జాతర పరిసరాల ప్రాంతాలలోని అనుమతి లేని మద్యం దుకాణాలు మూసివేయాలని, పోలీసు భద్రత ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అదనపు కలెక్టర్
తెలిపారు. ఈ సమావేశంలో రామగుండం కార్పొరేషన్ మేయర్ అనిల్ కుమార్, ఏసిపి తులా శ్రీనివాస్ రావు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఏ. చంద్రశేఖర్, ఎక్సైజ్ శాఖ అధికారి మహిపాల్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ
అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ , గోదావరిఖని ఆర్టీసీ డిపో మేనేజర్ నాగభూషణం, తహాసిల్దారులు, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.



