నన్ను ఒంటరిగా చేసినప్పుడు కన్నీళ్లు కార్చాను
మంత్రి పొంగులేటి
ఖమ్మం
ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో రైట్ ఛాయిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఆత్మీయ సత్కార సన్మాన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత వివక్షతకు గురయ్యారు. నిరుద్యోగులు అందరూ కలసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆ కుటుంబం చెప్పిందే వేదం. గత ప్రభుత్వం 6 లక్షల కోట్ల అప్పులు చేసిందని అన్నారు.
మా ప్రభుత్వం ఈ ఏడాది రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. టిఎస్పిఎస్సి ప్రక్షాళనకు మొదటి అడుగు పడిందని అన్నారు. మంత్రి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. నన్ను ఒంటరిగా చేసినప్పుడు కన్నీళ్లు కార్చాను. ఆ రోజు నేను ఎమోషనల్ ఎందుకు కాలేదు అంటే అభిమానులు బాధపడతారని అన్నారు……
నన్ను ఒంటరిగా చేసినప్పుడు కన్నీళ్లు కార్చాను
- Advertisement -
- Advertisement -