సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా పని చేయాలి
అడిషనల్ డీజీపీ షిఖా గోయల్
జగిత్యాల,
సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా పనిచేయాలని అడిషనల్ డీజీపీ షిఖా గోయల్ ఆన్నారు.. గురువారం
పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన
చర్యలపై హైదారబాద్ నుండి అడిషనల్ డీజీపీ షిక గోయల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీ మాట్లాడుతూ పెరిగిపోతున్న సాంకేతికత కు తగ్గట్టుగానే దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒకరిని సైబర్ వారియర్ గా నియమించడం జరిగిందన్నారు.. అదే విధంగా జిల్లా స్థాయిలో
డీ4సీ (డిస్టిక్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్) ఏర్పాటు చేసి ఒక డిఎస్పి స్థాయి అధికారి ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న సైబర్ నేరాల దర్యాప్తును పరిశీలించటం,
జరుగుతుందని అన్నారు. సైబర్ నేరాలను అదుపు చేయడంతో పాటు ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అవగాహన కల్పించడం, అన్ని స్థాయిల పోలీస్ అధికారులకు సైతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైబర్ క్రైమ్స్ పట్ల మరింత అవగాహన కలిగి ఉండాలని అన్నారు . చాలామంది ప్రజలు అవగాహన లోపం వల్ల సైబర్ క్రైమ్ బారిని పడుతున్నారని ముఖ్యంగా ఓటిపి ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. సైబర్ క్రైమ్ బారిన పడకుండా ప్రజలను చైతన్యపరిచి 1930కు కాల్స్ చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.వివిధ జిల్లాల్లో, వివిధ రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్లు ను అరెస్ట్ చేసిన సందర్భంలో వారిని పీటీ వారెంట్ పై తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని సూచించారు.సైకాప్స్ వంటి నూతన సాంకేతికను ఉపయోగించి సైబర్ నేరస్తులను పట్టుకోవాలని అన్నారు. ఆనంతరం పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు మరియు ఇతర సీనియర్ పోలీసు అధికారుల నుండి సైబర్ నేరాల నియంత్రణ ఫై తీసుకోవలసిన చర్యల పై పలు సూచనలు చేశారు..
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ,అదనపు ఎస్పీ ప్రభాకర రావు, సైబర్ క్రైమ్ డీఎస్పీ సురేష్ , ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ , సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు