మాదిగల శాతం తగ్గించే కుట్
మందకృష్ణ మాదిగ
హైదరాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చట్టసభలో మాదిగల శాతం తగ్గించే కుట్రలకు తెరలేపారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ దొరల పాలన చేస్తే….రేవంత్రెడ్డి పట్వారీ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. నియామకాలు పారదర్శకత కంటే…కులతత్వానికే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక సమతుల్య దెబ్బతింటుందని ఆక్షేపించారు. హైరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో మందకృష్ణ మాదిగ రాష్ట్రంలో జరుగున్న ప్రభుత్వ పాలన తీరుపై పలు విమర్శనాస్త్రాలను సంధించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశం సుప్రీం కోర్టులో ఉందని….వర్గీకరణ జరిగే వరకు ప్రభుత్వ నియామకాలు చెప్పట్టవద్దన్నారు. ఇండియా కుటమి నుంచి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రకటన చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాసినప్పుడే ఆ పార్టీని మాదిగలు విశ్వసిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మాదిగలకు జరుగుతున్న అన్యాయాలను సరిచేయకపోతే, వారి అవేదన అగ్రజ్వాలగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు..
మాదిగల శాతం తగ్గించే కుట్
- Advertisement -
- Advertisement -