రోడ్డు ప్రయాణం..అప్రమత్తతతో వ్యవహరించాలి

- Advertisement -

రోడ్డు ప్రయాణం..అప్రమత్తతతో వ్యవహరించాలి
హైదరాబాద్ జనవరి 24
జనవరి 15వ తేదీ నుండి ఫిబ్రవరి 14వ తేదీ వరకు రోడ్డు భద్రత మాసంగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్  మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా యువత చనిపోతున్నందున ఇంజనీరింగ్,  ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ ల ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రణపై ద్రుష్టి సారించారు. కాలనుగునంగా   వాహనాల సంఖ్య పెరుగుతుండడం, రోడ్లు విస్తారంగా ఉన్నప్పటికీ ప్రయాణికులు తగిన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి.2022 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 7500 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోగా భారత దేశంలో 1,68,000 మంది చనిపోయారని గణంకాలు చెబుతున్నాయన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, ఓవర్ స్పీడింగ్ ,డేంజరస్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం తదితర కారణాలవల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపద్యం లో రహదారులు ఉండే ప్రాంతాల్లో రోడ్ సేఫ్టీ క్లబ్బులను ఏర్పాటు చేయాలని, పోలీస్ కార్యాలయంలో డిస్టిక్ రోడ్ సేఫ్టీ బ్యూరో , కమిషనరేట్ లలో కమిషనరేట్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేసుకోవాలని పోలీసుశాఖ సూచించింది. అవసరమైతే ఈ చలాన్ నిధుల ద్వారా స్పీడ్ గన్స్ బ్రీత్ అనలైజర్స్ వంటి వాటిని కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించాలని , రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడే వారికి “గుడ్ సమా రిటన్” పేరిట సన్మానం చేయాలని డిజిపి చూచనలు చేసారు..ఈ రకమైన చర్యలు ఈ నెలకే పరిమితం కాకుండా దీర్ఘకాలంలోనూ అనుసరించాలని పోలీసు అధికారులకు డిజిపి స్పష్టం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular